Telangana | పేదలకు డిప్యూటీ సీఎం శుభవార్త, ఏడాదికి రూ.12 వేల ఆర్థికసాయం
x

Telangana | పేదలకు డిప్యూటీ సీఎం శుభవార్త, ఏడాదికి రూ.12 వేల ఆర్థికసాయం

తెలంగాణలో వ్యవసాయ భూమి లేని పేద కూలీలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం శుభవార్త వెల్లడించారు.పేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ఆయన చెప్పారు.


తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి లేని పేద కూలీలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం శుభవార్త వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబరు 28వతేదీన భూమి లేని పేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. నిరుపేద కూలీలకు మొదటి విడత రూ.6వేలు ఇస్తామని ఆయన తెలిపారు.

రైతుల కోసం రూ.50,953 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రైతుల కోసం రూ.50,953 కోట్లు ఖర్చు చేశామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధి కోసం రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు.

మూసీ నదీ పునరుజ్జీవన కార్యక్రమం

మూసీ నదీ పునరుజ్జీవన కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తామని, అన్ని జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని భట్టి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ల మధ్య పరిశ్రమలు, హౌసింగ్ క్లస్టర్ల ను ఏర్పాటు చేస్తామన్నారు.

సంక్రాంతి నుంచి రైతు భరోసా డబ్బులు

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఒక వైపు రైతులను ఆదుకుంటూనే రైతు కూలీలకు కూడా తాము ఆర్థిక సాయం అందిస్తామని ఆయన వివరించారు.

Read More
Next Story