మూసీ ఆక్రమణల కూల్చివేతలు షురూ
x

మూసీ ఆక్రమణల కూల్చివేతలు షురూ

మూసీ నదీ సుందరీకరణ ప్రాజెక్టుపై ముందడుగు పడింది. మూసీ నదీ తీర ప్రాంతంలోని శంకర్ నగర్ బస్తీలో ఆర్ బీ ఎక్స్ మార్కింగ్ చేసిన ఇళ్లను కూల్చివేతలు ప్రారంభించారు.


మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేతలు మంగళవారం ప్రారంభమయ్యాయి.భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. 140 మంది ఆక్రమణదారులు ఇళ్లను ఖాళీ చేయడంతో ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించింది.

మూసీ నదీ ఫుల్ ట్యాంక్ లెవెల్ లో ఉన్న 16వేల ఇళ్లను తొలగిస్తున్నారు. రివర్ బెడ్ ఎస్ట్రీమ్ ఆర్బీ ఎక్స్ అని మార్కింగ్ చేసిన ఇళ్లను కూల్చనున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి కొత్తగా డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- మూసీ తీరంలోని 55 కిలోమీటర్ల పరిధిలో 40వేల భవనాలున్నాయని అధికారులు గుర్తించారు. మూసానగర్, రసూల్ పుర, వినాయక్ నగర్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో ఇళ్లకు ఇప్పటికే ఆర్బీ ఎక్స్ పేరిట మార్కింగ్ చేశారు.
మూసీ నదీ తీరంలోని ఇళ్లను కూల్చివేసేందుకు బుల్డోజర్లు వెళ్లే దారి లేక పోవడంతో కూలీల సాయంతో ఇళ్లను కూల్చివేస్తున్నారు. నిర్వాసితుల ఇళ్ల సామాగ్రిని తరలించేందుకు జీహెచ్ఎంసీ వాహనాలను సైతం ఏర్పాటు చేసింది.

బాధితులకు కేటీఆర్ పరామర్శ
అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోల్నాక మున్సిపల్ డివిజన్ తులసీ రామ్ నగర్ ప్రాంతంలోని మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లలోని నివాసులను బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వెంటరాగా కేటీఆర్ బాధితులతో మాట్లాడారు.తమ ఇళ్లను కూల్చివేసి పార్కులు కడతారా అని బాధితులు ప్రశ్నించారు. గోల్నాక డివిజన్ లోని మూసి పరివాహక ప్రాంత హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు.

Read More
Next Story