Cricket Player Trisha | క్రికెటర్ త్రిషకు సీఎం రూ.కోటి నజరానా
x

Cricket Player Trisha | క్రికెటర్ త్రిషకు సీఎం రూ.కోటి నజరానా

మహిళల అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ లో రాణించిన తెలంగాణ అమ్మాయి- త్రిషకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. త్రిషకు కోటి రూపాయల నజరానాను ప్రకటించారు.


అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన మహిళా క్రికెటర్ గొంగడి త్రిష బుధవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసింది. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిష ను సీఎం అభినందించారు.భవిష్యత్ లో దేశం తరుపున మరింతగా రాణించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేశారు.

- క్రికెటర్ త్రిష కు కోటి రూపాయల నజరానా ను సీఎం ప్రకటించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్ తెలంగాణ కు చెందిన ధృతి కేసరి కి 10 లక్షల రూపాయల నజరానాను సీఎం ప్రకటించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్,ట్రైనర్ షాలినికి పది లక్షల రూపాయల చొప్పున నజరానా ఇస్తామని సీఎం చెప్పారు.
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story