
సీపీఐకి ఒక ఎమ్మెల్సీ.. పోటీలో ఇద్దరు కీలకనేతలు
ఎమ్మెల్సీ కోసం చాడా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మునుగోడు టికెట్ వదులుకున్నందుకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని నెల్లికంటి కోరుతున్నారు.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్షం సీపీఐకి ఒక సీటు ఇచ్చింది కాంగ్రెస్. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. కాగా ఇప్పుడు పరిస్థితుల్లో ఒక సీట్లు ఇచ్చింది. రేపు ఎమ్మెల్సీ అభ్యర్థులంతా కూడా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం అభ్యర్థులను ఖరారు చేయడంలో పార్టీలు తలమున్కలవుతున్నాయి. ఈ ప్రక్రియను కాంగ్రెస్ ఇప్పటికే పూర్తి చేసుకోగా.. ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటిసీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నిశ్చయించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గేతో వేణుగోపాల్ చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఖర్గే, వేణుగోపాల్ భేటీ అయ్యారు. టీపీసీసీ నుంచి అందిన మెరిట్ రిపోర్ట్‌ను పరిశీలించి అభ్యర్థులను ఖారారు చేశారు. ఇందులో భాగంగా మిత్రపక్షం సీపీకి ఒక సీటును కేటాయించారు.
కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే నేతల వివరాలు, మెరిట్ రిపోర్ట్‌ను హైకమాండ్‌కు టీపీసీసీ అందించింది. ఇందులో మైనారిటీ నుండి షబ్బీర్ అలీ, అజారోద్దీన్, బీసీ నుండి VH, వినయ్ కుమార్, ఎగ్గే మల్లేశం, ST సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్, నెహ్రు నాయక్, SC నుండి అద్దంకి దయాకర్, సిద్దేశ్వర్ రాచమల్లు, మహిళా కోట నుండి విజయశాంతి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్క సామాజికవర్గం నుంచి 3 పేర్లు సూచించిన రాష్ట్ర నాయకత్వం.
ఈ నేపథ్యంలోనే సీపీఐ నేతలు పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించానికి పార్టీ సన్నద్ధమయింది. ఒక ఎమ్మెల్సీ స్థానం టికెట్ ఎవరికి ఇవ్వాలని వారు చర్చించనున్నారు. ఈ సీటు కోసం చాడా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు టికెట్ వదులుకున్నందుకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని నెల్లికంటి సత్యం కోరుతున్నారు. మరి వీరిలో ఎవరిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీపీఐ ఖరారు చేస్తుందో చూడాలి.