బాలికపై అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు, సంచలన తీర్పు
x

బాలికపై అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు, సంచలన తీర్పు

బాలికపై అత్యాచారం కేసులో ఎల్‌బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు ఇచ్చింది.దోషికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.బాలికకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని పేర్కొంది.



రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఓ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసిన దోషికి పదేళ్ల జైలు శిక్ష, 15వేల రూపాయల జరిమానా విధిస్తూ ఎల్ బీ నగర్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
- 2019 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాలిక తండ్రి మరణించడంతో ఆమె తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. బాలిక పదోతరగతి పాసై ఇంటరు మీడియెట్ లో చేరింది. ఆర్థిక ఇబ్బందులతో బాలిక చదువును మధ్యలో వదిలేసింది.
- 2019 జనవరి నెలలో బాలికను ప్రేమ పేరిట భవన నిర్మాణ కార్మికుడు మండే అనిల్ (22) బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. దోషి అయిన అనిల్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ కలికల్ గ్రామ వాసి అని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ కేసును సెక్షన్ 376, 366(ఎ)ఐపీసీ సెక్షన్ 6 పోక్సో చట్టంకింద పోలీసులు నమోదు చేశారు. అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం, పోలీసులు అనిల్ ను అరెస్టు చేసి ఈ కేసులో చార్జ్ షీటు సమర్పించారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో అత్యాచారం జరిగిందని సాక్ష్యాధారాలతో నిరూపించారు.దీంతో పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. కోర్టు ఆదేశాలతో బాధితురాలికి నష్టపరిహారం కింద రూ.10లక్షలు అందించారు.


Read More
Next Story