TGRERA NOTICES | చెరువు స్థలాల్లో భారీ భవనాల నిర్మాణం, రెరా నోటీసులు
x

TGRERA NOTICES | చెరువు స్థలాల్లో భారీ భవనాల నిర్మాణం, రెరా నోటీసులు

నార్సింగ్ చెరువు, బుల్కాపూర్ నాలాలను ఆక్రమించి నిర్మిస్తున్న ట్రీటన్, సుమధుర ప్యాలీస్ రాయల్ మల్టీ స్టోర్ భవనాల నిర్మాణాలపై టీజీ రెరా నోటీసు జారీ చేసింది.


రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని నార్సింగి చెరువు-2, బుల్కాపూర్ నాలాలను ఆక్రమించి ట్రీటన్, సుమధుర ప్యాలీస్ రాయల్ ఆకాశ హర్మ్యాల నిర్మాణంపై పర్యావరణ యాక్టివిస్టు డాక్టర్ లుబ్నా సార్వత్ ఇచ్చిన ఫిర్యాదు మేర తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నోటీసు జారీ చేసింది.

- పుప్పాలగూడలోని సర్వే నంబరు 272 పి,273 పి, 274 పి స్థలంలో ఫోనిక్స్ గ్లోబల్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రీటన్ భవనం నిర్మాణానికి, సుమధుర కన్ స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సుమధుర ప్యాలీస్ రాయల్ పేరిట భవన నిర్మాణానికి బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ తీసుకున్నారు. దీనిపై రెరాతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసు పెండింగులో ఉంది.
- నార్సింగ్ చెరువు, బుల్కాపూర్ నాలాను ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నారని డాక్టర్ లుబ్నా సార్వత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఫిబ్రవరి 13వతేదీన రెరా కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని రెరా రిజిష్ట్రార్ నోటీసులు జారీ చేశారు.

ఫిబ్రవరి 13న విచారణ
చెరువు భూమి కబ్జా ఫిర్యాదులపై విచారణకు రావాలని కోరుతూ ఫోనిక్స్ గ్లోబల్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి పి శ్రవణ్ కుమార్ కు, సుమధుర కన్ స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి శ్రవణ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తెలంగాణ ఐఐసీఎల్ ఎండీలకు రెరా రిజిష్ట్రార్ నోటీసులు పంపించారు. చెరువు స్థలాలను ఆక్రమించి భవనాలు నిర్మిస్తూ తప్పుడు పత్రాలు సమర్పించారని డాక్టర్ లుబ్నా ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ చట్టం 2016లో పేర్కొన్న విధంగా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రజా ప్రయోజనం కోసం అప్పీల్ దాఖలు చేశానని డాక్టర్ లుబ్నా పేర్కొన్నారు.


Read More
Next Story