కేటీఆర్ ఎందుకు టెర్గెట్ అయ్యారో చెప్పిన కవిత..
x

కేటీఆర్ ఎందుకు టెర్గెట్ అయ్యారో చెప్పిన కవిత..

కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.


కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై నిరాధారంగా ఆరోపణలు చేయడం, గత ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేవారు. తెలంగాణలో కమిషన్ ప్రభుత్వం నడుస్తోందని, ఏ పని జరగాలన్నా 10శాతం కమిషన్ చెల్లించుకోవాల్సిందేనంటూ ఆరోపించారు. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, దీని వల్ల ఇప్పటి వరకు ఒక్కొక్క మహిళ రూ.30వేల వరకు లాస్ అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి కోసం కాకుండా కొందరి కోసమే పనిచేస్తోందని, ఈ పాలన అంతా అప్రజాస్వామికంగా నడుస్తోందని విమర్శలు చేశారు. గురుకులాలు బాగయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు. అది జరగకూడదంటే వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం తెలంగాణను ప్రపంచబ్యాంక్‌కు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంత జరుగుతున్నా కమ్యూనిస్టులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ, నామినేట్ పోస్టుల కోసమే కమ్యూనిస్టూలో నోరు మెదపడం లేదని విమర్శలు గుప్పించారు. ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం కోసం కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు.

కేటీఆర్‌పై కేసు కక్ష సాధింపు..

ఈ సందర్భంగా కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడంపై ఘాటు స్పందించారు. అది పూర్తిగా కక్ష సాధింపు చర్యేనని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని కాంగ్రెస్ తప్పుడు కేసులు బనాయిస్తోందని, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కోపంతోనే కేటీఆర్‌ను టార్గెట్ చేశారని ఆరోపించారు. అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్ బీఆర్ఎస్ నేతలు ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ తమకు అటువంటిదేమీ లేదని వివరించారు కవిత. తాము పదవుల నుంచి రాలేదని, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చామని గుర్తు చేశారు. కేటీఆర్ తప్పులు చేస్తే వాటిని సరిచేయి పాలన చేయాలిగానీ అసెంబ్లీ వ్యక్తిగత దూషణలు పనికిరావని, అసలు ఇటువంటి సంప్రదాయాన్ని సభాఅధ్యక్షుడు కూడా అనుమతించకూడదని కోరారు. ధరణి స్థానంలో వచ్చిన భూభారతికి కాలమే సమాధానం చెప్తుందని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ భాయ్ భాయ్

కేటీఆర్‌పై పెట్టిన కేసుతో బీజేపీ, కాంగ్రెస్ మిత్రులేనని రుజువైందని వ్యాఖ్యానించారు. గతంలో ఏ కేసు విషయంలో కూడా ఈడీ కేసు ఇంత త్వరగా ఈడీ స్పందించి కేసు నమోదు చేయలేదని తెలిపారు. కానీ కేటీఆర్ వ్యవహారంలో మాత్రం ఏసీబీ నుంచి స్వల్ప ఊరట లభించిన గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలోకి దిగడం, కేసు నమోదు చేయడం చేసేసిందని, దీని వెనక బీజేపీ హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతనే ఫార్మాలా-ఈ కార్ రేసు అంశంపై కేసు నమోదయిందని గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీలో ఉనికిలో ఉండకూడదని కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్లాన్ చేస్తున్నాయని, ఉమ్మడి ఏపీలో కూడా ఇప్పుడున్న నిర్భంధాలు లేవని అన్నారు. అప్పటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిస్తే.. బతుకమ్మ కోసం ఉమ్మడి జిల్లాకు రూ.లక్ష చొప్పున ఇచ్చారని చెప్పారు.

కేసీఆరే మా బాస్

‘‘మేమంతా కేసీఆర్ సైనికులం. ఆయన బయటకు రావడం లేదనడం సరికాదు. కేసీఆర్ సలహా ఇచ్చేటంత గొప్ప పనులను ఈ ప్రభుత్వం చేయడం లేదు. కేసీఆర్ సూచనల మేరకే బీఆర్ఎస్ కార్యక్రమాలు చేపడుతుంది. తెలంగాణ తల్లి, భూ భారతిపై ప్రతిపక్షాల సలహాలు ఎందుకు తీసుకోలేదు?’’ అని కవిత ప్రశ్నించారు. అదే విధంగా అల్లు అర్జున్ వివాదంపై కూడా స్పందించిన కవిత.. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయాల కోసం వాడుకుంటుందని విమర్శించారు. ఆ ఘటన వెనక బీఆర్ఎస్ హస్తం ఉందనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More
Next Story