Vijayashanti | ‘తెలంగాణ తల్లి రూపంపై కొట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు’
x

Vijayashanti | ‘తెలంగాణ తల్లి రూపంపై కొట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు’

తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహ రూపు రేఖలపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ నేత విజయశాంత ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహ రూపు రేఖలపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆవిష్కరించిన విగ్రహాన్ని తాము తెలంగాణ తల్లిగా పరిగణించమని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాకుండా సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విగ్రహానికి కాంగ్రెస్ తల్లిగా నామకరణం చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీర్మానం చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు కూడా కవిత.. శ్రీకారం చుట్టారు. సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణ తల్లి వివాద నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్ళీ ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంతో ఆమె తన ప్రజల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. జగిత్యాలలో తెలంగాణ తల్లి పాత విగ్రహ ఏర్పాటుకు చేస్తున్న భూమిపూజలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి(కాంగ్రెస్ మాత) కోసం ఎన్ని జీవోలు ఇచ్చినా వాటిని తాము లెక్కచేసేది లేదంటూ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఘాటుగా స్పందించారు. అసలు తెలంగాణ తల్లి అంశంపై పోరాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలుత 2007లో తల్లి తెంగాణ పార్టీ ఆవిష్కరించింది. ఆ విగ్రహాన్ని బీఎస్ రాములు రూపొందించారు. ఆ తర్వాత కొంతకాలానికే బీఆర్ఎస్.. తెలంాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. కానీ బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా.. విగ్రహానికి అధికార హోదా, గౌరవం ఇవ్వలేదు. ‘‘బీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి రూపం మార్పుపై ఆ పార్టీ కొట్లాడితే.. ఆ హక్కు వారికి ఎక్కడున్నది? తల్లి తెలంగాణ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ మార్చిందని నాటి మన తెలంగాణ ఉద్యమకారులు కూడా కొట్లాడవచ్చు. మన బోనాలు, బతుకమ్మ సంస్కృతి తరతరాలుగా నిలిచే ఉన్నవి, ఉంటాయి. అందుకు రాజకీయ పార్టీల ప్రయోజనార్ధ ప్రమేయం ఎన్నడూ అవసరం లేదు. రాదు. పానమెత్తుగా ప్రజలు కాపాడుకుంటూనే బతుకుతారు, బతికించుకుంటారు ఎప్పటికీ’’ అని విజయశాంతి తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.

Read More
Next Story