ఫార్ములా-ఇ రేస్ కుంభకోణాన్ని కేటీఆర్ సమర్థిస్తున్నారా..!
హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా-ఇ రేసింగ్‌లో జరిగిన రూ.55 కోట్ల కుంభకోణాన్ని మాజీ మంత్రి కేటీఆర్ సమర్థిస్తున్నారా? అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా-ఇ రేసింగ్‌లో జరిగిన రూ.55 కోట్ల కుంభకోణాన్ని మాజీ మంత్రి కేటీఆర్ సమర్థిస్తున్నారా? అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. ఈ వాదనలను తాజాగా ఈ రేసింగ్ అంశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరాల సరసన చేర్యాలన్న తాపత్రయంతోనే ఫార్ములా-1 రేసింగ్‌ను నిర్వహించాలని అనుకున్నామని, కానీ అందుకు నిర్వాహకులు అంగీకరించకపోవడంతో ఫార్ములా-ఇ రేసింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక మంచి ఉద్దేశంతో రేస్ నిర్వహిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ దానిపై రాద్దాంతం చేస్తోందని వ్యాఖ్యానించారు కేటీఆర్. ఈ ఫార్ములా-ఇ రేసింగ్‌లో జిరగిన రూ.55 కోట్ల కుంభకోణం కేసులో కేటీఆర్ పేరు వస్తుండటం వల్లే.. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఫార్ములా-ఇ రేసింగ్ కుంభకోణ ఉచ్చు తన మెడకు బిగుస్తుండటంతోనే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారా అని విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. అసలు గార్టెట్ ఫార్ములా-1 అయినా అనివార్య పరిస్థితుల్లో ఫార్ములా-ఇ రేసింగ్‌తో సరిపెట్టుకోవడం జరిగిందని అన్నారాయన.
ఎంతో తాపత్రయపడ్డా: కేటీఆర్
‘‘1946లో భారత్ వేదికగా ఫార్ములా-1 రేసింగ్ జరిగింది. ఈ రేస్‌ను నిర్వహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు పోటీ పడుతుంటాయి. కానీ ఈ రేస్‌ను భారత్‌లో నిర్వహించాలని చంద్రబాబు 2003లో ఆలోచించారు. కానీ అది సాధ్యం కాలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అదే అంశాన్ని మళ్ళీ నేను లేవనెత్తాను. అయినా ప్రయోజనం లేదు. మళ్ళీ మన దేశానికి ఫార్ములా-1 రేసు దూరమైంది. హైదరాబాద్‌లో ఫార్ములా-1 నిర్వహించడానికి నిర్వాహకులు నో చెప్పారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలతో నిర్వహించే ఫార్ములా-ఇ రేస్‌ను నిర్వహించాం. అయినా కామన్వెల్త్ క్రీడటంలే కాంగ్రెస్ చేసిన కుంభకోణమే గుర్తుకొస్తోంది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
ఇప్పుడు రాద్ధాంతమా..
‘‘1984లో భారత్ వేదికగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఆనాడు కామన్వెల్త్ క్రీడల కోసం నాటి కాంగ్రెస్ పార్టీ అసలు ఖర్చు కంటే 100 రెట్లకు పైగానే ఖర్చు చేసింది. అంతర్జాతీయ క్రీడల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం షరామామూలే. దాంతో పోల్చుకుంటే ప్రస్తుత నిర్వహణ వ్యవయం 10-15 రెట్లు పెరుగుతుంది. కానీ ఓ మంచి ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఫార్ములా-ఇ రేస్ నిర్వహించాం. కానీ దాని గురించి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాద్దాంతం చేస్తోంది’’ అని విమర్శించారు కేటీఆర్. కాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. తప్పు చేయడమే కాకుండా ఇలాంటి జరుగుతుంటాయన్న ధోరణిలో మాట్లాడుతూ ఫార్ములా-ఇ రేసులో జరిగిన కుంభకోణాన్ని కేటీఆర్ సమర్థిస్తున్నారా అని విశ్లేషకులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.
కేటీఆర్‌ది సమర్థింపా.. ఎదురుదాడా..?
ఫార్ములా-ఇ రేసు నిర్వాహణ సమయంలో రూ.55 కోట్ల కుంభకోణం జరిగిందని అంశంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో కేటీఆర్ పేరు కూడా బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఫార్ములా-ఇ రేసులో కుంభకోణం జరిగిందా? లేదా? అన్న అంశంపై క్లారిటీ ఇవ్వకుండా.. ఆనాడు 1984లో కాంగ్రెస్ ఎక్కువ ఖర్చు పెట్టిందంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం అనేక చర్చలకు దారితీస్తోంది. అలనాడు కాంగ్రెస్ తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు తప్పు జరుగుతుంటే పట్టించుకోకూడదని కేటీఆర్ అంటున్నారా? లేక జరిగిన రూ.55 కోట్ల కుంభకోణాన్ని సమర్థించుకుంటున్నారా? అని పలువురు ప్రశ్నిస్తుంటే. తన వ్యాఖ్యలతు అసలు కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఒప్పుకుంటున్నారా? అన్న అనుమానాలు కూడా అధికం అవుతున్నాయి. మరి వీటిపై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.