Harish Rao
x

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

Harish Rao | నీటి శాఖ మంత్రి నియోజకవర్గంలోనే నీటి సమస్యలు!

తెలంగాణ రాష్ట్రంలోని నీటి సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ రాష్ట్రంలోని నీటి సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కుతున్నారన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు రైతన్నల కష్టాలు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే సాగు నీటి కోసం రైతన్నట్లు నానా అవస్థలు పడుతున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. సీఎం రేవంత్ సహా ఇతర మంత్రుల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, ఆచరణలో గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నకు క‘న్నీటి’ గోసను తప్పట్లేదన్నారు.

‘‘పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిని దుస్థితిని కల్పించింది. సాగు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యపేటలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏమిటి. యాసంగి సాగునీటి విడుదల షెడ్యూల్ పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలు ఇచ్చారు. SRSP స్టేజ్ -2 లో భాగంగా తుంగతుర్తి, సూర్యపేట, కోదాడ తదితర నియోజకవర్గాల్లోని 3,36,630 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రచారం చేసుకున్నారు గానీ, రైతన్నల పంట పొలాలకు నీళ్లు మాత్రం విడుదల చేయడం లేదు. మీ ప్రభుత్వ మాటలు నమ్మి నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏం కావాలి సీఎం. నాట్ల దశలోనే సాగునీటికి గోస పడితే, మన్ముందు సాగు నీరు నీటి సరఫరా ఎలా చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహా మంత్రుల మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అని మరోసారి రుజువైంది. అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించడం మానేసి, ఇప్పటికైనా ఆచరణకు దిగండి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం మానేసి, పంట పొలాలకు నీళ్లు అందించండి. ఆందోళనలో ఉన్న రైతన్నకు దన్నుగా నిలవండి’’ అని హరీష్ రావు తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట పెట్టారు.

Read More
Next Story