
వృద్ధురాలికి కలెక్టర్ సహాయం
కన్న కొడుకు, కోడలు తనకు పట్టెడన్నం పెట్టడం లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ మహిళకు కలెక్టర్ ఆసరా అందించారు.
కొడుకు కోడలు ఉన్నా నిరాదరణకు గురై నడవలేని స్థితిలో ఓ వృద్ధురాలు తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరడానికి కలెక్టరేట్ కు వచ్చి పడుతున్న ఇబ్బందిని కళ్లారా చూసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ తక్షణం స్పందించారు. వృద్ధురాలి దీనస్థితిని విని పాలనాధికారి చలించారు.
కొడుకు, కోడలున్నా పట్టెడన్నం పెట్టక పోవడంతో తల్లడిల్లిన వృద్ధురాలైన ఆ తల్లి రుక్మిణి నడవలేని పరిస్థితిలో సహాయం కోసం నారాయణ పేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చింది. కలెక్టరు కార్యాలయం మెట్టు ఎక్కలేక అపసోపాలు పడుతూ తన ఇద్దరు కూతుళ్ల సహాయంతో వస్తున్న రుక్మిణీ అనే వృద్ధురాలిని బయట నుంచి కలెక్టరేటుకు వస్తున్న నారాయణపేట జిల్లా కలెక్టరు సిక్తా పట్నాయక్ చూశారు. అక్కడే తన వాహనం ఆపిన కలెక్టరు వృద్ధురాలి వద్దకు వచ్చి రుక్మిణీ సమస్యను అడిగి తెలుసుకొని, ఆమెకు వీల్ ఛైర్ అందించి పట్టణంలోని సఖీ కేంద్రానికి తరలించారు.
రుక్మిణీ కథ విని చలించిన కలెక్టరు