CM Boat Ride | సింగపూర్ నదిలో సీఎం రేవంత్ పడవ ప్రయాణం
x

CM Boat Ride | సింగపూర్ నదిలో సీఎం రేవంత్ పడవ ప్రయాణం

సింగపూర్ దేశంలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అక్కడి నదిలో పడవ ప్రయాణం సాగించారు. సింగపూర్ నదుల పునరుజ్జీవనం అద్భుతమని సీఎం ప్రశంసించారు.


తెలంగాణ రాష్ట్రానికి విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు సాధించేందుకు సింగపూర్ దేశంలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్మమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదివారం ఆటవిడుపుగా సింగపూర్ నదిలో పడవలో ప్రయాణించారు. సింగపూర్ దేశంలో నదుల పునరుజ్జీవనం చారిత్రక ప్రయత్నాలు, నీటి నిర్వహణలో పురోగతిని సింగపూర్ అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.

- సింగపూర్ నది చుట్టు పక్కల ఉన్న అద్భుతమైన కొత్త ఐకానిక్ భవనాలు, కార్యాలయాలు, నివాసాలు, సింగపూర్ లోని మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి సీఎం సింగపూర్ అధికారులను ఆరా తీశారు. వారసత్వ భవనాల పునరుద్ధరణ, సంరక్షణ ప్రయత్నాలు బాగున్నాయంటూ సీఎ రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

సింగపూర్ పద్ధతులను అనుసరిస్తాం : సీఎం
సింగపూర్ దేశంలో నదుల పునరుజ్జీవనంపై పాటించిన ఉత్తమ పద్ధతులను తాము హైదరాబాద్ నగరంలో అనుసరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరంలో మూసీ నదిని పునరుజ్జీవింప చేసి అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో సీఎం సింగపూర్ నదిలో పడవలో ప్రయాణిస్తూ అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.


Read More
Next Story