Revanth Reddy | రైతు సదస్సుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..
x

Revanth Reddy | రైతు సదస్సుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..

ప్రజా పాలన విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే రైతు సదస్సులను అవగాహన కార్యక్రమాల్లా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.


ప్రజా పాలన విజయోత్సవాల(Praja Palana Vijayotsavalu)ను తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఎటువంటి లోటు లేకుండా అన్ని కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. వీటిలో భాగంగా నవంబర్ 30న మహబూబ్‌నగర్ వేదికగా రైతు సదస్సు(Rythu Sadassu) నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. కాగా ఈ రైతు సదస్సులో రాష్ట్రంలోని ప్రతి రైతు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క రైతు కూడా ఈ సదస్సును మిస్ కాకూడదని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతు సదస్సును బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు రేవంత్.

ఈ క్రమంలోనే ఈరోజు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఇందులో రైతు సదస్సు అంశం ప్రధానంగా చర్చలు జరిగాయి. ఈ సదస్సు ద్వారా వ్యవసాయంలో అధునాతన సాగు పద్దతులు, మెళకువలను రైతులకు తెలియజేయాలని, అందుకోసం వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్దక శాఖ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దాంతో పాటుగానే వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా రైతులకు పామాయిల్‌పై కూడా అవగాహన కల్పించాలని చెప్పారు.

ఈ స్టాల్స్‌లో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల కొత్త ఆవిష్కరణలు, ఇతర కంపెనీల ఉత్పత్తులను ఉంచాలని వెల్లడించారు. అధునాతన పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లు అన్నింటినీ కూడా ప్రయోగాత్మక ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలని కూడా తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ రైతు సదస్సును రైతులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మూడు రోజుల పాటు నిర్వహించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ స్టాళ్లను 28వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దీంతో రాష్ట్రంలోని రైతులంతా కూడా.. దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పొందేలా సదస్సు ఉండాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం 23 లక్షల మంది రైతులకు ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కొన్ని చోట్ల ఆధార్ నెంబర్ల తప్పులు, బ్యాంకు ఖాతాల్లో పేర్ల తప్పులు, కుటుంబాల నిర్ధారణ కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివేదికను అందించారు.

Read More
Next Story