Revanth Reddy | ఫుడ్ పాయిజన్ విషయంలో కలెక్టర్లపై సీఎం ఆగ్రహం..
x

Revanth Reddy | ఫుడ్ పాయిజన్ విషయంలో కలెక్టర్లపై సీఎం ఆగ్రహం..

తెలంగడాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు.


తెలంగడాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సచివాలయంలో వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు సహా లబ్ధిదారుల జాబితాల తయారీపై చర్చించారు. జనవరి 26 నుంచి ఈ పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకాల అమలు విషయంలో పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వీటి అమలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించడానికి వెంటనే సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు పోషకాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారి డైట్ ఛార్జీలను పెంచింది. ఆ తర్వాత కూడా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోటు ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం ఏంటి? ప్రభుత్వ పాఠశాలల, రెసిడెన్షయల్ పాఠశాలల్లో తరచుగా ఇలా ఎందుకు జరుగుతుంది? పాఠశాలలను కలెక్టర్‌లు తరచుగా తనిఖీ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమా? పాఠశాలల పరిశీలన విషయంలో అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇక నుంచి ప్రతి వారం ప్రభుత్వ పాఠశాలలు, రసిడెన్షియల్ పాఠశాలల్లో కలెక్టర్‌లు విజిట్ చేసి అక్కడి పరిస్థితులు, అందిస్తున్న ఆహార నాణ్యత అంశాలపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలి. అదే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా? ఆహారం ప్రతి రోజూ బాగుంటుందా? లేదా? వంటి విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి’’ అని కూడా సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు సూచించారు.

Read More
Next Story