దేశానికి మెడల్స్ తీసుకురండి... రేవంత్
ప్యారిస్ ఒలింపిక్స్ 2014లో విజయాలతో దూసుకుపోతున్న తెలంగాణ అథ్లెట్స్ ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
ప్యారిస్ ఒలింపిక్స్ 2014లో విజయాలతో దూసుకుపోతున్న తెలంగాణ అథ్లెట్స్ ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆయా కేటగిరీల తొలిదశలో ఉత్తమ ప్రతిభ కనిబరిచిన వారికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), పీవీ సింధు (బ్యాడ్మింటన్) లకి ఫోన్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. వీరంతా తర్వాతి దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడల్స్ సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ (షూటింగ్) కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.
ఇక ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియా నుంచి 117 మంది అథ్లెట్లు 16 ఈవెంట్స్ లో పోటీ పడుతున్నారు. దేశానికి ఎక్కువ మెడల్స్ సాధించడమే లక్ష్యంగా దూసుకెళుతున్నారు. ఇప్పటికే మనోభాకర్ షూటింగ్ విభాగంలో భారత్ కి తొలి పతకం అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలిచింది. షూటింగ్ తో పాటు ఆర్చరీ, బ్యాడ్మింటన్ లో మన అథ్లెట్లు మెడల్స్ సాధిస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ మెడల్స్ కి పోటీ పడుతున్న నలుగురు అథ్లెట్లు మెడల్స్ తెస్తారని భారీగా అంచనాలు ఉన్నాయి. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాక్సింగ్ లో నిఖత్ జరీన్, శ్రీజ ఆకుల తమ ఈవెంట్స్ లో తొలి రౌండ్స్ లో విజయం సాధించారు. ప్రత్యర్ధులను చిత్తు చేసి విజయంవైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.