
ఫేస్ న్యూస్‌తో ప్రమాదం తప్పదు: సీఎం రేవంత్
సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రతల్లేంటి అనేది ప్రతి ఒక్కరికీ తెలియాలని రేవంత్ అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు హత్య, దోపిడీలు తీవ్ర నేరాలుగా ఉండేవని, కానీ ఈరోజున సైబర్ నేరాలు అత్యంత తీవ్రమైనవిగా భావించబడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ HICC లో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ – 2025 (షీల్డ్)ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సైబర్ నేరాలు, సైబర్ భద్రతపై ఆయన మాట్లాడారు. ప్రజలందరికీ సైబర్ సేఫ్టీపై అవగాహన ఉండాలని, సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రతల్లేంటి అనేది ప్రతి ఒక్కరికీ తెలియాలని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా సైబర్ నేరాలు, సైబర్ సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణలో లక్షకుపైగా సైబర్ నేరాలు
షీల్డ్-2025 సదస్సు రెండు రోజులపాటు జరగనుంది. ఇందులో ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈఓ రాజకుమార్ తోపాటు మరికొన్ని ఇంతమంది ఐటీ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే క్రిప్టో కరెన్సీ, డీప్ ఫేక్ , డిజిటల్ ప్రపంచంలో మహిళల రక్షణ,మ్యూల్ ఖాతాలపైనా కృత్తిమ మేధ ద్వారా సైబర్ భద్రతకు అవగాహన కల్పించాలని నిపుణులు పేర్కొన్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా 22,812 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ జరిగిందని వివరించారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 1,20,869 సైబర్ నేరాలు సంభవించాయని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా 17,912 మంది బాధితులకు రూ.183 కోట్లను చెల్లించినట్లు చెప్పారు నిపుణులు.
నేరం జరిగాక పట్టుకోవడం కాదు: సీఎం
‘‘సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930.. 24/7 అందుబాటులో ఉంటుంది. సమాజంలో వస్తున్న సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నేరాల రూపు మారింది సైబర్ క్రైం పట్ల జాగ్రత్త వహించాలి. దేశంలో సైబర్ క్రైం రూపుమాపటంలో తెలంగాణ మొదటి వరుసలో ఉంది. సైబర్ నేరాల నిరోధానికి దేశం మొత్తం ఒకే యూనిట్‌గా పనిచేయాలి. ఈ కార్యక్రమం చేపట్టిన అధికారులను అభినందిస్తున్నాను. ఇది అత్యంత కీలక సదస్సు. నేరాల విధానం వేగంగా మారుతోంది. సమాజంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’’ అని సూచించారు.
ఫేక్ న్యూస్‌తో ప్రమాదం తప్పదు
‘‘సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేరం జరిగిన తరువాత పట్టుకోవడం కాదు.. నేరం జరగకుండా నిరోధించేలా చర్యలు తీసుకోవాలి. కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు. ఫేక్ న్యూస్‌తో పాటు ఆర్థిక నేరాలను కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుదాం. నేరాల విధానం చాలా వేగంగా మారుతుంది. ఫేక్ న్యూస్ తో ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు దేశంలో మర్డర్ ,దోపిడీ లు తీవ్ర నెరలుగా ఉండేవి. ఇప్పుడు అత్యంత పెద్ద నేరం సైబర్ నేరం’’ అని అన్నారు.
సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలి
‘‘పోలీస్ అధికారులు నిరంతర కృషి తో తెలంగాణ లో సైబర్ నేరాలు కట్టడి చేస్తున్నాం. తెలంగాణ ను సైబర్ సేఫ్టీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ప్రతి సెకండ్ సైబర్ నేరాల జరుగుతున్నాయి. నేరం జరిగిన తరువాత పోలీసులు పెట్టుకునేవారు, ఇప్పుడు నేరం జరగకుండా పోలీసులు నిరోధించాలి. దేశం మొత్తం ఒక తాటీ పైకి వచ్చి సైబర్ క్రైం పై పోరాడాలి. సోషల్ మీడియా ను కంట్రోల్ చేయాలి. తప్పుడు సమాచారం సమాజానికి శ్రయస్ కరం కాదు. తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ న్యూస్‌తో చాలా ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించారు.