గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంపై సీఎం,పీఎం దిగ్భ్రాంతి
x

గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంపై సీఎం,పీఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్ గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్రమోదీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


హైదరాబాద్​ ఓల్డ్ సిటీ మీర్ చౌక్ లోని గుల్జార్‌ హౌస్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో సీఎం మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి,, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.పోలీస్​, ఫైర్​ విభాగం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.స్థానిక కుటుంబాలతో కూడా ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులను కాపాడుతామని భరోసా ఇచ్చారు.దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డిని ఆదేశించారు.స్థానిక కుటుంబాలతో ఫోన్ లో సీఎం పరామర్శించారు.


మృతులకు మోదీ సంతాపం
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబానికి ప్రధాని ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.మృతుల బంధువులకు పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా,గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని ప్రధాని మోదీ చెప్పారు.

బాధితులకు అండగా ఉంటాం : పొన్నం ప్రభాకర్
అగ్ని ప్రమాద ఘటన పై అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడిన మంత్రి వారికి అండగా ఉంటానని తెలిపారు.గాయపడిన వారికి మెరుగైనమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించానని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఘటనపై బాధిత కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు.

అగ్నిమాపకశాఖ ఏం చెప్పిందంటే...
గుల్లార్ హౌస్ వద్ద ఉదయం 6:16 గంటలకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది.సమాచారం రాగానే వెనువెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టి మంటలు ఆర్పేశారు.బాధిత కుటుంబాలకు ఎక్కడ ఇబ్బందులు కలగకూడదని సీఎం జారీ చేసిన ఆదేశాలతో వైద్య శాఖ అధికారులు ,పోలీసులు , ఫైర్ సిబ్బంది ఇక్కడే ఉండి చర్యలు తీసుకుంటున్నారు.అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం లేదని, ప్రమాదవశాత్తు జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు.

ఆసుపత్రిలో మంత్రి ఆరా
మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీపీ సీవీ ఆనంద్, ఎమ్మెల్సీ వెంకట్,అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని బంధువుల తో కలిసి వివరాలు తెలుసుకుంటున్నారు.



Read More
Next Story