హైదరాబాద్‌లో కొత్తగా చుడీదార్ గ్యాంగ్ హల్చల్
x

హైదరాబాద్‌లో కొత్తగా "చుడీదార్ గ్యాంగ్" హల్చల్

చైన్ స్నాచర్స్, బ్లేడ్ బ్యాచ్, చెడ్డీ గ్యాంగ్ ఇవి మనకి తెలిసిన కొన్ని ముఠాల పేర్లు. చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే చుడీదార్ గ్యాంగ్ ఎంటర్ అయ్యింది.


మనం కొన్నిరకాల దొంగల ముఠాల పేర్లు తరచూ వింటూనే ఉంటాం. చైన్ స్నాచర్స్, బ్లేడ్ బ్యాచ్, చెడ్డీ గ్యాంగ్ ఇవి మనకి తెలిసిన కొన్ని ముఠాల పేర్లు. వీటిలో బాగా పాపులర్ అయిన చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే లేటెస్ట్ గా హైదరాబాద్ లోకి చుడీదార్ గ్యాంగ్ ఎంటర్ అయ్యింది.

తాజాగా ఎస్ఆర్ నగర్ లో మహిళల వేషధారణలో వచ్చిన దొంగలు చోరీకి పాల్పడడం కలకలం రేపుతోంది. ఆ గ్యాంగ్ చుడీదార్ వేసుకుని లేడీ గెటప్ లో వచ్చి దొంగతనం చేయడంతో వీరికి "చుడీదార్ గ్యాంగ్" గా నామకరణం చేసేశారు. ఈ గ్యాంగ్ ఇటీవల అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో దొంగతనానికి పాల్పడుతుండగా సీసీటీవీ కి చిక్కడంతో విషయం బయటకి వచ్చింది.

మే 18వ తేదీ రాత్రి జెక్ కాలనీలోని ఆకృతి ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లోని కె.వెంకటేశ్వర్‌రావు అనే ప్రైవేట్‌ ఉద్యోగి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఒంగోలు వెళ్లాడు. శనివారం ఉదయం ఇంటి పనిమనిషి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించింది. వెంటనే ఆమె ఈ విషయం యజమాని వెంకటేశ్వరరావుకి చెప్పడంతో ఆయన ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మే 18న చుడీదార్లు ధరించి, మాస్క్‌లు ధరించి ఇద్దరు దుండగులు అపార్ట్‌మెంట్‌ లోకి చొరబడ్డారని సీసీటీవీ ఫుటేజీ సహాయంతో పోలీసుల దర్యాప్తులో తేలింది. దొంగలు నాలుగు తులాల బంగారం, రూ. 1 లక్ష నగదు, ల్యాప్‌టాప్ దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. గతంలో సరిగ్గా ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడే చెడ్డీ గ్యాంగ్‌తో ఈ చుడీదార్ గ్యాంగ్ సిమిలర్ గా ఉందని భావిస్తోన్న పోలీసులు ఆ దిశలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story