బాలల మాక్ అసెంబ్లీ స్ఫూర్తిదాయకం, బాలలకు సీఎం రేవంత్ అభినందన
బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా విద్యార్థులను సీఎం అభినందించారు.
బాలల దినోత్సవం సందర్భంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి పిల్లలతో సరదాగా గడిపారు. హైదరాబాద్ ఎస్‌సీఆర్టీ ఆఫీస్ ప్రాంగంణంలో చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ ఒపెన్ అవర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.ఇలాంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు.విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యత.లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని సీఎం చెప్పారు. విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలని సీఎం చెప్పారు.కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని సీఎం ఆరోపించారు.
Hon’ble Chief Minister Sri.A.Revanth Reddy participates in Children’s Day Celebrations - 2024 (Mock Assembly) at Godavari Hall, SEAMAT Building, Hyderabad https://t.co/H32MKf3iFq
— Telangana CMO (@TelanganaCMO) November 14, 2024