HAPPY NEW YEAR 2025 |పసందైన విందులు,వినోదాలతో న్యూఈయర్‌కు ఛీర్స్
x

HAPPY NEW YEAR 2025 |పసందైన విందులు,వినోదాలతో న్యూఈయర్‌కు ఛీర్స్

హైదరాబాద్ నగరంలో న్యూ ఈయర్ జోష్ కనిపిస్తోంది. 2024 వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2025 వ సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు హైదరాబాదీలు సమాయత్తం అయ్యారు.


కాలగమనంలో కలిసిపోనున్న 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ మద్యపానీయాలతో ఛీర్స్ కొట్టేందుకు, 2025 వ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు,ఫంక్షన్ హాళ్లు, పసందైన విందులు, వినోదాలకు సమాయత్తం అయ్యాయి.

- నూతన సంవత్సర వేళ మద్యం తాగి, డ్యాన్సులు చేసేందుకు యువత సంసిద్ధమయ్యారు. వివిధ ప్రాంతాల్లో పార్టీలు, విందు, వినోదాలతో హైదరాబాద్ నగరం డిసెంబరు 31వతేదీ రాత్రి మార్మోగనుంది.
- హైదరాబాద్ నగరంలో 2025వ సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు అద్భుతమైన వేదికలు సిద్ధం అయ్యాయి. 2024వ సంవత్సరానికి గుడ్ బై చెబుతూ హైదరాబాదీలు డిసెంబర్ 31వతేదీ అర్దరాత్రి 12 గంటలకు మద్యపానీయాలతో ఛీర్స్ చెప్పబోతున్నారు.
- కుటుంబసభ్యులు, స్నేహితులు నూతన సంవత్సర వేడుకల కోసం కచేరీలు, వినూత్న ఈవెంట్లతో హైదరాబాద్ నగరం ముస్తాబైంది. వీనుల విందుగా వినిపించే లైవ్ మ్యూజిక్, విలాసవంతమైన విందులతో వేడుకలకు నగరం సిద్ధం అయింది. బుక్ మై షోలో టికెట్లను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు.

ఆఫర్ల వర్షం
కొత్త సంవత్సరం వేడుకల్లో అతిథులను ఆకట్టుకునేందుకు వివిధ హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు, పబ్ లు, రిసార్టులు ఆఫర్లు ప్రకటించాయి. మా రిసార్టులో కొత్త సంవత్సర వేళ రూం బుక్ చేసుకుంటే డిన్నర్, మద్యం ఫ్రీ అంటూ కొన్ని రిసార్టులు ప్రకటించాయి. మా రెస్టారెంటుకు కుటుంబంతో కలిసి వస్తే కేక్ కట్ చేయవచ్చని రెస్టారెంట్లు ఆఫర్ ఇచ్చాయి. కొన్ని బేకరీలు కిలో కేక్ కొంటే హాఫ్ కేజీ కేక్ ఫ్రీ అంటూ ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త ఆఫర్లతో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనే పనిలో ప్రజలు మునిగారు.

అలరించనున్న పాటకచేరీ
నగరంలోని ప్రజం బౌల్డర్ హిల్స్ లో డిసెంబరు 31 రాత్రి 7 గంటల నుంచి జరగనున్న నూతన సంవత్సర వేడుకల్లో ప్రముఖ తెలుగు గాయకులు కార్తీక్, సునీతల లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.ఇందులో మల్టీ-బ్రాండెడ్ ఫుడ్ కోర్ట్‌లు, కిడ్స్ ప్లే జోన్, ఒకే వేదికపై రెండు కచేరీలు ఏర్పాటు చేశారు.టికెట్ ధర రూ.1699.

బేగంపేట హాకీ స్టేడియంలో కంట్రీక్లబ్ అతిపెద్ద వేడుకలు
కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో ఆసియాలో అతిపెద్ద నూతన సంవత్సర బాష్ 2025 నిర్వహించనున్నారు. సినీనటి దక్షా నాగర్కర్ ఈ వేడుకల్లో పాల్గొంటారు. డీజే సంగీతం ద్వారా ప్రత్యక్ష ప్రదర్శన ఉంటుంది.టికెట్ ధర రూ.199.

హెచ్ఐసీసీ నోవోటెల్‌లో...
హెచ్ఐసీసీ నోవోటెల్‌లో జరగనున్న న్యూ ఈయర్ వేడుకల్లో బాలీవుడ్ డీజే, లైవ్ బ్యాండ్, మ్యాజిక్ షో, కిడ్స్ జోన్, అపరిమిత ఆహారం, పానీయాలు, టాటూ, ఫొటో బూత్ ఉంటాయి. ఈ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీనటి శ్రీలీల పాల్గొననున్నారు. టికెట్ ధర రూ.1,499.

దుర్గం చెరువు సరస్సులో...
దుర్గం చెరువు సరస్సులో బిగ్ బాష్ న్యూఈయర్ ఈవెంట్ 2025 – బీచ్ నేపథ్య పార్టీ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ సంగీతం, పంజాబీ ధోల్, టాటూ స్టాల్స్, మ్యాజిక్ షోలు జరగనున్నాయి.ఈ వేడుకల్లో అతిథులకు పానీయాలు,ఆహారం అందిస్తారు.టికెట్ ధర రూ.299.

న్యూఈయర్ వేడుల్లో సర్కస్
ప్రిజం క్లబ్ కిచెన్ లో సర్కస్ నేపథ్య ఆకృతి, రామ్ మిర్యాల ప్రత్యక్ష ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీంతో పాటు షాడో దుబాయ్ రవీష్ డీజేతోపాటు మద్యం, మాక్ టెయిల్, కాక్ టెయిల్, శీతల పానీయాల సరఫరా చేయనున్నారు. టికెట్ ధర రూ.2,499.

ఉప్పల్ స్టేడియంలో బిగ్గెస్ట్ ఓపెన్ ఎయిర్ న్యూ ఇయర్ ఈవెంట్
ఉప్పల్ స్టేడియంలో బిగ్గెస్ట్ ఓపెన్ ఎయిర్ న్యూ ఇయర్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకల్లో ప్రాంతీయ లైవ్ బ్యాండ్, అంతర్జాతీయ డీజేలు ఏర్పాటు చేశారు. అపరిమిత పానీయాలు, శీతల పానీయాలు సర్వ్ చేయనున్నారు.టికెట్ ధర రూ.149.

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రాయల్ డిన్నర్
తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రాయల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. విలాసవంతమైన బఫే, ప్రీమియం పానీయాలు, కూచిపూడి ప్రదర్శనలు, ప్రత్యక్ష డీజే, 5 ముక్కల బ్యాండ్ ఏర్పాటు చేశారు. టికెట్ ధర రూ.23,,600.
- లక్స్ ఫోర్ట్ వ్యూ ఈవెంట్ చరణ్ కోటలో హర్ష గన్నోజీ లైవ్ బ్యాండ్, బాలీవుడ్ మిక్స్‌లు, ప్రాంతీయ డీజే ఉంటుంది. టికెట్ ధర రూ.
- రామోజీ ఫిలిం సిటీలో డీజే చేతస్ తో న్యూఈయర్ పార్టీ డిసెంబరు 31 రాత్రి 8 గంటల నుంచి ఉంటుంది. డిన్నర్, పానీయాలు అందిస్తారు. టికెట్ ధర రూ.2,00.
- యూనోస్ ఫుడ్ మార్కెట్ లో గ్రాండ్ వేడుక నిర్వహించనున్నారు.ఈ వేడుకల్లో ప్లేబ్యాక్ సింగర్స్ లిప్సిక, పర్ణిక, తెలుగు ఇండియన్ ఐడల్ ఫేమ్ కార్తికేయ ప్రదర్శనలు ఉంటాయి. ఆహారం, ప్రీమియం ఆల్కహాల్, లైవ్ డీజే ఏర్పాటు చేశారు.టికెట్ ధర రూ.రూ.699.



Read More
Next Story