ఉపాధి అవకాశాలకు కేరాఫ్...హైదరాబాద్
నిరుద్యోగుల ఉపాధి అవకాశాలకు కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో హైదరాబాద్ గణనీయమైన ఉపాధి వృద్ధి సాధించిందని సర్వే తెలిపింది.
ఢిల్లీ,బెంగళూరులతో పాటు హైదరాబాద్ నగరం కూడా ఉపాధి అవకాశాలకు కేంద్రంగా అభివృద్ధి చెందిందని తాజా నివేదికలో వెల్లడైంది.ఆరోగ్య సంరక్షణ,ఫార్మా,ఆటోమోటివ్,తయారీ,ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాల్లో హైదరాబాద్ గణనీయమైన ఉపాధి వృద్ధిని పొందిందని నివేదిక సూచిస్తుంది.
నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం
హైదరాబాద్ నగరంలోని పలు సంస్థలు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాయని తాజా సర్వేలో తేలింది.రాబోయే సాంకేతిక పురోగమనాల కోసం తమ శ్రామికశక్తిని వివిధ సంస్థలు సన్నద్ధం చేస్తున్నాయని టీమ్‌లీజ్ స్టాఫింగ్ సీఈఓ కార్తిక్ నారాయణ్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
శ్రామికశక్తి పెరిగే అవకాశం
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్,ట్రావెల్,హాస్పిటాలిటీ,ఎలక్ట్రిక్ వాహనాలు,ఈవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పురోగతి సాధిస్తున్నాయి.భారతీయ ఉపాధి మార్కెట్‌లో సానుకూల నియామక సెంటిమెంట్‌ను సర్వేలో సూచించాయి.ఈ సర్వేలో పాల్గొన్న 56 శాతం మంది యజమానులు రాబోయే రోజుల్లో తమ శ్రామిక శక్తి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
డైనమిక్ టాలెంట్ హబ్‌గా హైదరాబాద్
పరిశ్రమల యజమానులు బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, శ్రద్ధ,సాంకేతిక నైపుణ్యం,సంస్థాగత సామర్థ్యాలతో ఉన్న అభ్యర్థులు కావాలని కోరుకుంటున్నారు.డైనమిక్ టాలెంట్ హబ్‌లలో హైదరాబాద్,నవీ ముంబయి, పూణే నగరాలు నిలిచాయి.భారతీయ నగరాల్లో అభివృద్ధి చెందుతున్న ఉపాధి అవకాశాల గురించి ఈ నివేదిక తెలిపింది.
జీవన నాణ్యతలో హైదరాబాద్ ఫస్ట్
ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు ఇప్పుడు ఆధునిక సౌకర్యాలు,ఫలహారశాలలు, వినోద ప్రదేశాలు,ఫిట్‌నెస్ క్లబ్‌ల వంటి సౌకర్యాలున్న కార్యాలయ క్యాంపస్‌లను ఇష్టపడుతున్నారు.కనెక్టివిటీ,ప్రయాణ సమయం,భద్రత,ఆరోగ్య సంరక్షణ,గాలి నాణ్యత,జీవన నాణ్యత పరంగా హైదరాబాద్,నవీ ముంబయి,పూణే మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.వాణిజ్య లీజింగ్ ధరల్లో చెన్నై,హైదరాబాద్,నవీ ముంబయి ముందంజలో ఉన్నాయి.
ఐటీ హబ్...హైదరాబాద్
ఐటీ ఉద్యోగాలకు హైదరాబాద్ నగరం హబ్ గా మారింది. ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ హైటెక్ సిటీ ముందుందని అప్రెంటిస్‌షిప్ ఔట్‌లుక్ నివేదిక వెల్లడించింది.హైదరాబాద్,ఢిల్లీ,బెంగళూరు నగరాలు ఐటీ,టెక్ పరిశ్రమలకు కేంద్రాలుగా మారాయి.
Next Story