ఓటు వేసేందుకు ఊరెళ్తున్నారా... బస్సుల వివరాలు
x

ఓటు వేసేందుకు ఊరెళ్తున్నారా... బస్సుల వివరాలు

హైదరాబాద్ నుండి ఓటర్లు సొంతూళ్ళకి పయనమయ్యారు. వేలాదిగా లక్షలాదిగా తరలి వెళ్తోన్న ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి.


హైదరాబాద్ నుండి ఓటర్లు సొంతూళ్ళకి పయనమయ్యారు. వేలాదిగా లక్షలాదిగా తరలి వెళ్తోన్న ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోయాయి. మే 13 సోమవారం తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. వీకెండ్ కూడా కలిసిరావడంతో శుక్రవారం సాయంత్రం నుండే తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు జనం ఊరి బాట పట్టారు. అటు సొంత వాహనాలలో వెళ్లేవారితో రహదారులు సైతం కిక్కిరిసిపోయాయి.

సొంతూళ్ళకి వెళ్లే ప్రయాణికులు బస్టాండు వద్దకి భారీగా చేరుకోవడంతో రాత్రి 9 గంటల వరకు తెలంగాణ, ఏపీ జిల్లాలకు 300 కి పైనే ప్రత్యేక సర్వీసులు వెళ్లాయని రంగారెడ్డి జోన్ ఆర్ఎం వెల్లడించారు. శని, ఆదివారాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉండొచ్చనే అంచనాతో 1500 బస్సులు అదనంగా నడిపేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

బస్సుల వివరాలు...

MGBS నుంచి రోజూ 3,500 బస్ సర్వీసులు నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో 500 బస్సులు నడపనున్నారు. LB నగర్ నుంచి 300 స్పెషల్ బస్సులు నల్గొండ, కోదాడ, విజయవాడకి నడవనున్నాయి. ఉప్పల్ నుంచి 300 ప్రత్యేక బస్సులు తొర్రూర్, నర్సంపేట, వరంగల్ కి వెళ్లనున్నాయి. ఆరాంఘర్ నుంచి 200 స్పెషల్ సర్వీసులు నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కర్నూల్ కి, ఎంజీబీఎస్ నుంచి 500 బస్సులు విజయవాడ, కర్నూల్, ఖమ్మం, ఒంగోలు కి ఏర్పాటు చేశారు. జేబీఎస్ నుంచి 200 స్పెషల్ బస్సులు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు తెలంగాణ లోని పలు జిల్లాలకు నడుపుతున్నారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు.

Read More
Next Story