Komatireddy Venkat | కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదో చెప్పిన కోమటిరెడ్డి..
x

Komatireddy Venkat | కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదో చెప్పిన కోమటిరెడ్డి..

కేసీఆర్ అసెంబ్లీకి రావకపోవడానికి ఒకటే కారణం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.


అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ బయట పెద్దగా కనిపించట్లేదు. ఆఖరికి అసెంబ్లీకి కూడా ఆయన రావట్లేదు. అధికారి పార్టీ డిమాండ్ చేసినా, ప్రజలు కోరినా సరే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌ను విడిచి బయటకు రావడం లేదు. కవిత.. జైలు నుంచి విడుదలైన రోజున కూడా ఆమే ఫామ్ హౌస్‌కు వెళ్ళి కేసీఆర్‌ను కలిశారు. కాగా ఈ అంశంపై తాజాగా తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్.. సభకు ఎందుకు రావట్లేదో తనకు తెలుసున్నారు. తనకు మళ్ళీ అధికారం రాదని కేసీఆర్‌కు అర్థమైపోయిందని, అందుకే ఆయన ప్రజలకు తన మొఖం చూపించుకోలేకున్నారని, అందులో ఆ ఫామ్‌హౌస్‌లో దాక్కుంటున్నారంటూ చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన వివరించారు. కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను హౌలాగాళ్లను చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

‘‘మళ్ళీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్ కు లేదు. అందుకే అసెంబ్లీ వస్తలేరు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురే ఉన్నపుడు కూడా భట్టి విక్రమార్క అసెంబ్లీకి వచ్చారు. 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ ఎందుకు వస్తలేరు. కొడుకు, అల్లుడు, బిడ్డలను మేము పట్టించుకోం. డీలిమిటేషన్‌లో 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయి. జమిలి డ్రాఫ్ట్ రెడీ అయింది. మా సీఎం , మంత్రులు పబ్లిక్‌కి అందుబాటులో ఉంటున్నాము’’ అని చెప్పారు.

‘‘ప్రతిపక్ష హోదా లేకున్నా ఖర్గే, అదిర్ రంజాన్ చౌదరి పార్లమెంట్‌కి వెళ్లారు. బడ్జెట్ సమావేశాల వరకు కొత్త కౌన్సిల్ రెడీ. కాంగ్రెస్ లో మంత్రి వర్గ విస్తరణ ఎవరికి పదవులు అనేది ఎవరు చెప్పలేరు. ఈ విషయం పార్టీ అధిష్టానం, సీఎం దే తుది నిర్ణయం. పాలమూరు నుంచి శ్రీహరికి కచ్చితంగా మంత్రి పదవి ఇది చెప్పగలను. నల్గొండలో 2018 లో భూపాల్ రెడ్డి వికలాంగుడి అని సానుభూతితో గెలిపించారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఓడారు నేనెంత. కల్వకుర్తిలో ఎన్టీఆర్ మీద చిత్త రంజన్ ఇంట్లో నుంచి గెలిచారు. నా మీద 80 కోట్లు ఖర్చు పెట్టారు బురా నర్సయ్య గౌడ్ అయ్యినా నేనే గెలిచినా. ప్రతిపక్ష ఎంపీగా ఎన్నో రోడ్ ప్రాజెక్టులు తీసుకొచ్చిన. గడ్కరీ నిన్న సీఎంకు చెబుతున్నారు వెంకన్న నాకు చోటా బాయ్ అని అర్థం’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

Read More
Next Story