ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
x

ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.


రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అవతరణ తర్వాత రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు సంపూర్థ మద్దతు ఇస్తూనే వస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో 2001 నుంచి స్పష్టంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.

అస్తిత్వ ఉద్యమానికి నాయకుడిగా, ప్రజల ఆకాంక్షలను పూర్తిగా అర్థం చేసుకున్న నాయకుడిగా కేసీఆర్.. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారు. ఆనాడు మరొక అస్థిత్వ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ మాదిగను తప్పకుండా ఈ సభలో గుర్తు చేసుకోవాలి. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఎమ్మార్పీఎస్, టీఎమ్మార్పీఎస్, ఇతర సంఘాలు, సంస్థలు, వ్యక్తులు చేసిన పోరాటానికి కేసీార్ అండగా నిలిచారు. కానీ వర్గీకరణ విషయంలో వారు పోరాడితే మేం అడ్డుకున్నట్లు చిత్రీకించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్.. 2014 నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా ఇదే అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిని కేంద్రానికి కూడా పంపడం జరిగింది. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ వర్గీకరణ నడుం బిగించండని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు కేసీఆర్ అని గుర్తు చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీర్మానం చేసి చేతులు దులుపుకోలేదని, అప్పటి ప్రధాని మోదీని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది చిత్తశుద్ధి అని తీర్మానం కాపీని అందించామని చెప్పారు.

Read More
Next Story