కేసీయార్ కు అర్ధరాత్రి షాకిచ్చిన రేవంత్
x

కేసీయార్ కు అర్ధరాత్రి షాకిచ్చిన రేవంత్

ఎయిర్ పోర్టు నుండి తనింటికి రేవంత్ చేరుకున్న కొద్దిసేపటికే ఆరుగురు ఎంఎల్సీలు కూడా రేవంత ఇంటికి చేరుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు.


కారుపార్టీకి చెందిన ఆరుగురు ఎంఎల్సీలు తమ అధినేత కేసీయార్ కు పెద్ద షాక్ ఇచ్చారు. గురువారం అర్ధరాత్రి ఆరుగురు ఎంఎల్సీలు ఒక జట్టుగా చేరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండురోజుల ఢిల్లీ పర్యటన నుండి రేవంత్ హైదరాబాద్ కు తిరిగొచ్చారు. ఎయిర్ పోర్టు నుండి తనింటికి రేవంత్ చేరుకున్న కొద్దిసేపటికే ఆరుగురు ఎంఎల్సీలు కూడా రేవంత ఇంటికి చేరుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్ ఎంఎల్సీల్లో మెజారిటి కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అవుతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. 40 మంది సభ్యులున్న శాసనమండలిలో కాంగ్రెస్ బలం బుధవారం వరకు 6 మాత్రమే. అలాంటిది గురువారం అర్ధరాత్రి చేరికలతో పార్టీ బలం 12కి చేరుకుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ బలం 29 నుండి 23కి తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీనేతల సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ 15 మంది ఎంఎల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వల్సుంది. ఇపుడు చేరిన 6గురితో కలుపుకుని మొత్తం 21 మంది కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందరు ఒకేసారి చేరుతారా లేకపోతే విడతలవారీగా చేరుతారా అన్నదే సస్పెన్సుగా మారింది.

ఇపుడు జరిగిన చేరికలను గమనిస్తే అందరినీ ఒకేసారి కాకుండా విడతల వారీగా చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకనే మొదటిబ్యాచ్ లో దండె విఠల్, భానుప్రసాదరావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గపాడు దయానంద్, ఎగ్గే మల్లేష్, బసవరాజు సారయ్యలు కాంగ్రెస్ లో చేరారు. సారయ్యతో పాటు బండా ప్రకాష్ కూడా చేరుతారని అనుకన్నారు. అయితే ఎందుకనో ప్రకాష్ చేరలేదు. రేవంత్ రెడ్డి ఈమధ్య వరంగల్ పర్యటనలో నిర్వహించిన అధికారుల సమీక్షలో సారయ్యతో పాటు బండా ప్రకాష్ కూడా హాజరయ్యారు. రేవంత రివ్యూ మీటింగులో హాజరవ్వటంతోనే వీళ్ళిద్దరు హస్తంపార్టీలో చేరిపోవటం ఖాయమనే ప్రచారం బాగా జరిగింది. అయితే తాజా చేరికల్లో సారయ్యతో ప్రకాష్ ఎందుకనో కనబడలేదు.

నిజానికి వీళ్ళ చేరికలు వారంరోజుల క్రితమే జరగాల్సుంది. కాని ఎందుకనో ఆలస్యమైంది. ఈనెలఖరులో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి. ఈలోగానే ఎంతమందిని వీలుంటే అంతమందిని చేర్చుకోవాలని రేవంత్ టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే సంఖ్యాబలం కారణంగా బిల్లులు పాస్ అవటానికి కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవే బిల్లులు శాసనమండలిలో పాస్ అయ్యే అవకాశంలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కు పూర్తి మెజారిటి ఉంది. అసెంబ్లీలో పాసయ్యే బిల్లులు మండలిలో పాస్ కాకుండా అడ్డుకోవాలని బీఆర్ఎస్ కూడా ప్లాన్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ మండలిలోని బీఆర్ఎస్ సభ్యులను చేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. దాని ఫలితమే బీఆర్ఎస్ ఎంఎల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకోవటం. ఇటు అసెంబ్లీ అటు మండలిలోనూ బీఆర్ఎస్ ను కోలుకోకుండా దెబ్బకొట్టడమే రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మొదటి బ్యాచ్ ఎంఎల్సీల చేరిక పూర్తయ్యింది కాబట్టి రెండో బ్యాచ్ ఎప్పుడో చూడాలి.

Read More
Next Story