హైదరాబాద్ చేరుకున్న కవిత
x

హైదరాబాద్ చేరుకున్న కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె భర్త, తనయుడు, అన్న కేటీఆర్, పార్టీ శ్రేణులతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె భర్త, తనయుడు, అన్న కేటీఆర్, పార్టీ శ్రేణులతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే ఆమె రాక కోసం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మధ్యాహ్నం నుంచి ఎయిర్పోర్టు వద్ద ఎదురు చూస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆమె విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు కవితకి ఘన స్వాగతం పలికారు. గులాబీ నేతలు, కార్యకర్తలు ఆమెపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా కవిత వారందరికీ అభివాదం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

ఈ ఏడాది మార్చ్ 15 న లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఆమెను బంజారాహిల్స్ నివాసంలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. దాదాపు ఐదు నెలల జైలు జీవితం తర్వాత తిరిగి ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఇక కవిత ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా బంజారాహిల్స్ నివాసానికి చేరుకోనున్నారు. గురువారం ఎర్రవెల్లిలోని ఫార్మ్ హౌస్ లో తండ్రి కేసీఆర్ ని కలుసుకోనున్నారు.

ఐదు నెలలు కూతురుని చూడని తండ్రి...

కూతురు ఐదు నెలలపాటు జైల్లో ఉన్నా ఒక్కసారి కూడా కేసీఆర్ ఆమెని చూసేందుకు ఢిల్లీ వెళ్ళలేదు. రెండు సార్లు అనారోగ్యం పాలైనప్పుడు కూడా వెళ్లి చూడకపోవడం విశేషం. అయితే కూతురుని జైల్లో చూడలేకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లలేదని, ఆమె కడిగిన ముత్యంలా తిరిగొస్తుందన్న బలమైన నమ్మకంతోనే కేసీఆర్ ఉండిపోయారని బీఆర్ఎస్ శ్రేణులు వాదిస్తున్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ ఈడీ, సీబీఐ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న కవితకి మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మద్యం పాలసీ కేసులో కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందజేసింది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇచ్చిన షూరిటీ బాండ్లను ట్రయల్ కోర్టు స్వీకరించింది. అనంతరం ఆమెని అధికారులు తీహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి రిలీజ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో జరిగే లిక్కర్ పాలసీ సీబీఐ కేసు చార్జ్ షీట్‌పై విచారణకు కవిత వర్చువల్ గా హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వచ్చారు.

Read More
Next Story