తలసాని ఇంట ఎమ్మెల్యేల సమావేశం.. కేటీఆర్ కూడా..
x

తలసాని ఇంట ఎమ్మెల్యేల సమావేశం.. కేటీఆర్ కూడా..

తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే లంచ్ మీటింగ్ జరిగింది.


తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే లంచ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో పార్టీ కార్యకలాపాలు, మేయర్‌పై అవిశ్వాసం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వాటిలో ఎలా నడుచుకోవాలి అన్న అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ విజయం సాధించాలని, ఆ దిశగా ప్రణాళికలు రచించాలని తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి ఎండగట్టాలని, గ్రేటర్ పరిధిలో మరింత దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు నడవాలని కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా పార్టీ నేతలకు పలు ఇతర అంశాలపై కూడా దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం ఆపొద్దని, ప్రతి నేతలకు బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా అండగా ఉంటుందని, ఎవరూ కాంగ్రెస్ పార్టీ తాటాకు చప్పుళ్లకు భయపడొద్దని ధైర్యం చెప్పినట్లు సమాచారం. వీటితో పాటుగా ప్రస్తుతం జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్‌కు ఉన్న కార్పొరేటరల సంఖ్యతో పాటు అవిశ్వాసం పెట్టడానికి ఎంతమంది కార్పొరేటర్లు కావాలి అన్న విషయంపై చర్చిస్తున్నారు. ఎలాగైనా మేయర్‌ను దించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story