సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోండి..
x

సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోండి..

కేసీఆర్ పట్ల కనీస మర్యాద లేకుండా సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు తమ ఫిర్యాదులో తెలిపారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు శంభీపూర్‌రాజు, మర్రి రాజవేఖర్‌రెడ్డి, వివేకానంద పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి మర్యాద మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పట్ల కనీస మర్యాద లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకుగానూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆ పదవిని కించపరచడమేనని ఆగ్రమం వ్యక్తం చేశారు.

మార్చి 12న హైదరాబాద్ రవీంద్రభారతిలో లెక్చరర్ పోస్ట్‌లకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి. కాగా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు మీరు మాకు స్టేచర్ ఉందని అనుకుంటే.. ఆ స్టేచర్ ఉందని విర్రవీగితేనే ఇప్పుడు స్ట్రెక్చర్‌పైకి పంపారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చుకురీకి పోతరు. అది కూడా గుర్తు పెట్టుకోవాలే’’ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు.. పోలీసులను ఆశ్రయించారు.

Read More
Next Story