అవమానించి గెంటేసిన వాడే ఇప్పుడు దిక్కయ్యాడా...
x

అవమానించి గెంటేసిన వాడే ఇప్పుడు దిక్కయ్యాడా...

వరంగల్‌లో కేసీఆర్ పరువు కాపాడటానికి గెంటేసిన వ్యక్తే దిక్కయ్యారా? ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకు గెంటేశారు? కేసీఆర్‌కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?



వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ సీటు అభ్యర్ధిగా మాజీ ఎమ్మేల్యే తాటికొండ రాజయ్యను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. రాజయ్య ఇటీవలి కాలంలోనే కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేసి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్‌లో అనేక అవమానాలను ఎదుర్కొన్నానని, తాను ఇంచార్జ్‌గా ఉన్న రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించానని, అయినా తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఏ పార్టీలో చేరకుండా అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత వరంగల్ పార్లమెంట్ వేదికగా జరిగిన పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వరంగల్ విషయంలో కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య బీఆర్ఎస్‌కు షాకిచ్చారు. ఏరికోరి కావ్యను అభ్యర్థిగా ఎంపిక చేస్తే చివరి క్షణంలో ఆమె తాను పోటీ చేయలేనని చెప్పింది. తండ్రీకూతురు కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వలేదని కోపగించుకున్న తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన్నే వరంగల్ అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక్కడ రాజయ్యకు ప్లస్ పాయింట్ ఏమిటంటే... ఆయన గులాబీ పార్టీకి రాజీనామా చేసినా ఏ పార్టీలో జాయిన్ కాలేదు. అందుకే ఆయనను పిలిపించుకుని మరీ టిక్కెట్ ఇచ్చారంటే.. అవమానించి గెంటేసిన వ్యక్తే ఇప్పుడు కేసీఆర్ పరువు కాపాడేందుకు వరంగల్ బరిలో నిలవక తప్పలేదు. పార్టీకి రాజీనామా చేసిన రాజయ్యకు కనీసం కండువా కూడా కప్పకుండా, కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారంటే.. పదేళ్లు ఏకచత్రాది పత్యంగా తెలంగాణను ఏలిన రాజుకు ఇలాంటి పరిస్థితి రావడం విధిలీలే అందామా?



Read More
Next Story