
BRS Charge Sheet | రేవంత్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ శనివారం చార్జ్ షీట్ ను విడుదల చేసింది. ఏడాది పాలనలో ఎడతెగని వంచన అంటూ బీఆర్ఎస్ ఆరోపించింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన చూస్తే(Congress One Year Rule) ఏమున్నది గర్వకారణం? కాంగ్రెస్ పాలన సమస్తం, ప్రజాపీడన పరాయణత్వం అంటూ హరీష్ రావు బీఆర్ఎస్ చార్జిషీటులో(BRS Charge Sheet) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదని, ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామని చెప్పారు.
- కాంగ్రెస్ పాలనలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నరని, పెంచిన పింఛన్ ఇవ్వలేదని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయలేదని, మహాలక్ష్మి పథకం కిద రూ.2,500 ఇస్తామని మహిళలను మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు. బడి పిల్లల నుంచి అవ్వాతాతల వరకు అందర్నీ కాంగ్రెస్ సర్కారు నడిరోడ్డు మీదకు ఈడ్చిందని ఆయన పేర్కొన్నారు.
- 18పేజీలతో విడుదల చేసిన చార్జిషీటులో బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టింది. ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి అన్ని వర్గాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. మహాలక్ష్మీ, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు అవకాశం, చేయూత పథకాల అమలులో సర్కారు విఫలమైందని చార్జిషీటులో ఆరోపించారు.
- దివాలా అంటూ రాష్ట్ర ఖ్యాతిని దిగజార్చారని, రైతు సంక్షేమానికి రాహుకాలం దాపురించిందని, సంపూర్ణ రుణ మాఫీ జరగక రైతన్న బతుకు ఆగం అయిందని, రైతుబంధుకు రాంరాం చెప్పారని, కౌలు రైతులు, ఉపాధి కూలీలకు ఎదురుచూపులే మిగిలాయని పేర్కొన్నారు. ఏడాది పాలనలో 565 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని చార్జిషీటులో పేర్కొన్నారు.
- మహాలక్ష్మీ పేరిట మహా మోసం చేశారని, తులం బంగారం ఎగ్గొట్టారని, బతుకమ్మ చీరల ఊసే లేదని, కేసీఆర్, న్యూట్రిషన్ కిట్టు లేదని పేర్కొంది.
- నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిండా ముంచారని, గురుకుల విద్యార్థులు పుడ్ పాయిజన్ తో ప్రాణాలు కోల్పోతున్నారని,చేయూత పేరుతో పింఛన్ దారులకు మొండి చేయి చూపించారని, పోలీసు కుటుంబాలను వారితోనే కొట్టించారని, ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టి మొండిచేయి చూపించారని ఆరోపించారు.
- ఆటోవాలాలపై రేవంత్ కక్ష సాధించారని, కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు అధోగతి చెందాయని చార్జిషీటులో పేర్కొన్నారు.పేదోడి గూడును రేవంత్ సర్కారు చెదరగొట్టిందని, ఫార్మా విలేజీల పేరిట పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టారని, శాంతిభద్రతలు లేవని, పది సంవత్సరాల ప్రగతిని పన్నెండు నెలల్లో పాడు చేశారని పేర్కొంది. ఏడాది పాలన విజయోత్సవాలు కాదు వంచనోత్సవాలు జరపాలని హరీష్ రావు విడుదల చేసిన బీఆర్ఎస్ చార్జిషీటులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో రోడ్డెక్కని రంగమే లేదు.
— BRS Party (@BRSparty) December 8, 2024
విద్యార్థుల దగ్గరినుంచి అవ్వా తాతల వరకు అన్ని వర్గాల వారిని రోడ్లు ఎక్కేలా చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుంది.
- కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish… pic.twitter.com/6gyi7fkL6H
Next Story