కృత్రిమ మేథతో బాధితులకు న్యాయం చేయండి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
x

కృత్రిమ మేథతో బాధితులకు న్యాయం చేయండి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కృత్రిమ మేథతో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు..


ప్రపంచంలో రోజురోజుకు సాంకేతికంగా పలు మార్పులు వస్తున్నాయని, కృత్రిమ మేథను ఉపయోగించుకొని న్యాయవాదులు బాధితులకు న్యాయం అందించేలా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.నల్సార్ యూనివర్శిటీలో 21 స్నాతకోత్సవంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.ధనికులతో పోలిస్తే పేదలకు న్యాయం అందడం లేదని ఆమె పేర్కొన్నారు.

- మెరుగైన సమాజం కోసం న్యాయ విధానంలో మార్పు రావాలని ఆమె సూచించారు. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహ దీక్ష చేశారని ఆమె గుర్తు చేశారు. న్యాయవాద వృత్తిలో నిబద్ధత, పారదర్శకత అవసరని ద్రౌపది ముర్ము చెప్పారు.
- శామీర్ పేటలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే లు పాల్గొన్నారు.
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు ఘన స్వాగతం పలికారు.


Read More
Next Story