CM Revanth Reddy | నా భర్తను సౌదీ నుంచి రప్పించండి,సీఎంకు మహిళ వినతి
x

CM Revanth Reddy | నా భర్తను సౌదీ నుంచి రప్పించండి,సీఎంకు మహిళ వినతి

సౌదీ అరేబియాలో అక్రమ నివాసిగా చిక్కుకు పోయిన తన భర్తను స్వదేశానికి రప్పించాలని జగిత్యాలకు చెందిన ఓ మహిళ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు.


జగిత్యాల పట్టణానికి చెందిన కుక్కల చిన్న భీయయ్య అక్రమ నివాసిగా సౌదీ అరేబియా దేశంలో చిక్కుకు పోయారు. భీమయ్య కుమారుడు సునీల్ బోన్ మారో (ఎముక మూలుగు) వ్యాధితో బాధపడుతున్నాడు. తన కుమారుడు సునీల్ ప్రాణాలు కాపాడేందుకు తన భర్తను సౌదీ నుంచి రప్పించాలని జగిత్యాలకు చెందిన గంగ లక్ష్మీ సీఎం రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు.


జగిత్యాల పట్టణం 29వ వార్డు కు చెందిన కుక్కల చిన్న భీమయ్య వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలోని దమ్మామ్ లో అక్రమ నివాసిగా చిక్కుపోయాడు. అతని కుమారుడు సునీల్ బోన్ మారో (ఎముక మూలుగు) వ్యాధితో ఆసుపత్రి పాలయ్యాడు. బోన్ మారో మార్పిడి చికిత్సకు దాతగా భీమయ్యను సౌదీ నుంచి రప్పించాలని అతని భార్య గంగ లక్ష్మి కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సహాయంతో సీఎం ఏ.రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు.

చికిత్సకు కావాల్సిన డబ్బు కోసం తమ ఇల్లు అమ్మడానికి కూడా భీమయ్య ఇండియాకు రావలసిన అవసరం ఉందని గంగ లక్ష్మీ చెప్పారు. సౌదీ లో ఉన్న సామాజిక సేవకుడైను గాజుల నరేష్ స్థానిక అధికారులతో పాటు రియాద్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ తో సమన్వయం చేస్తున్నారు. సునీల్ ప్రాణాలు కాపాడటం కోసం భీమయ్యను సౌదీ నుంచి స్వదేశానికి రప్పించాలని కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సీఎంను కోరారు.


Read More
Next Story