బీసీ కమిషన్ కుల గణన సన్నాహాలు షురూ
x

బీసీ కమిషన్ కుల గణన సన్నాహాలు షురూ

తెలంగాణ బీసీ కమిషన్ కుల గణనకు సన్నాహాలు ప్రారంభించింది.బీసీ కమిషన్ సమావేశంలో కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కులగణన కోసం చేస్తున్న సన్నాహాలను వివరించారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల్లోగా కుల గణన చేపట్టాలని ఈ నెల 9వతేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీసీ కమిషన్ సోమవారం సన్నాహాలు ప్రారంభించింది. బీసీ కమిషన్ పర్యవేక్షణలో కుల గణన చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బీసీ కమిషన్ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించనుంది.


పది పాత జిల్లా కేంద్రాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ
తెలంగాణలోని పది పాత జిల్లా కేంద్రాల్లో ఈ నెల 24వతేదీ నుంచి బీసీ కమిషన్ పర్యటించి బహిరంగ విచారణ జరపాలని నిర్ణయించింది. దీని కోసం బీసీ కమిషన్ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది.బీసీలకు చెందిన మేధావులతో త్వరలో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది.

అక్టోబర్ 24 నుంచి కులాల సర్వే
స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించే బాధ్యత బీసీ కమిషన్‌కు ఉంది.తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 9న జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రంలో జరగబోయే కులాల సర్వే కోసం తదుపరి చర్యలపై వెనుకబడిన తరగతుల (బీసీ) కమిషన్ చర్చించింది.



Read More
Next Story