ఈడీ విచారణలో అజారుద్దీన్..
x

ఈడీ విచారణలో అజారుద్దీన్..


మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఈరోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై ఈడీ విచారణ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ విచారణకు ఈరోజు హాజరయ్యారు అజారుద్దీన్. మంగళవారం విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసిన క్రమంలో ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు కూడా బదులిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తానని, తనపై వచ్చిన ఆరోపణలను అధికారికంగానే తొలగించుకుంటానని చెప్పారు. కాగా ఈ వ్యవహారంపై కొంతకాలంగా ఈడీ ముమ్మరంగా విచారణ చేస్తోంది. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా అవినీతి రూ.20 కోట్ల వరకే జరిగిందా.. అంతకు మించి జరిగిందా అన్న అంశాలతో పాటు ఏయే అంశాల్లో అవినీతి జరిగిందన్న అంశాలపై దర్యాప్తును పరుగులు పెట్టిస్తోంది. కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం కోసం జనరేటర్లు, అగ్నిమాపక వాహనాు, ఇతర సామాగ్రి కొనుగోలుకు సంబంధించి రూ.20కోట్ల వరకు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఫోకస్ పెట్టింది. ఈ కేసు విచారణ కోసమే అజారుద్దీన్‌ను విచారణ జరిపింది.

అసలేంటీ కేసు..

2020-2023 మధ్య కాలంలో ఉప్పల్ స్టేడియంలో జిమ్ సామాన్లు, అగ్నిమాపక సామాన్లు, క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్ ఇలా మరెన్న సామాన్ల కొనుగోలులో భారీతా అవకతవకలు జరిగాయంటూ హెచ్‌సీఏ సీఈఓ సునీల్ కంటె.. ఉప్పల్‌లో అప్పటి హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై ఫిర్యాదు చేశారు. టెండర్ల కేటాయింపులో కూడా కోట్లలోనే అవినీతి జిరగిందని ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలినట్లు కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటిపై దర్యాప్తు చేయాలని ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు నమోదైన కొంతకాలానికే జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అజారుద్దీన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటే అదే సమయంలో డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కూడా అజారుద్దీన్ కొనసాగిన క్రమంలోనే ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు ఈ మాజీ ఎంపీ.

Read More
Next Story