హైదరాబాద్ శివార్లలో దారుణం
x

హైదరాబాద్ శివార్లలో దారుణం

కుటుంబ కలహాలు ఓ కుటుంబంలో కల్లోలం రేపిన దారుణ ఘటన గాజుల రామారంలో గురువారం జరిగింది. కుటుంబ తగాదాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంది.


హైదరాబాద్ నగర శివార్లలోని గాజుల రామారంలో కుటుంబ కలహాలు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం ప్రాంతానికి చెందిన తేజస్వీని రెడ్డి తన ఇద్దరు కొడుకులు హర్షిత్ రెడ్డి(7), ఆశిష్ రెడ్డి(5)లను కొబ్బరి బోండాల కత్తితో నరికింది.ఈ ఘటనలో హర్షిత్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావమై ఆశిష్ రెడ్డి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నే ప్రాణాలు కోల్పోయాడు.


గాజుల రామారంలో కలకలం
ఇద్దరు కొడుకులను అతి కర్కశంగా కత్తితో నరికి చంపిన తేజస్వినీ అయిదు అంతస్తుల భవనం పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గాజుల రామారం ప్రాంతంలో కలకలం రేగింది. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఆరు పేజీల సూసైడ్ నోట్ లభ్యం
తేజస్వినీ రెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు ఆరు పేజీల సూసైడ్ నోట్ ను రాసినట్లు జీడిమెట్ల పోలీసులు చెప్పారు. సూసైడ్ లేఖ ఆధారంగా కుటుంబ తగాదాలే ఈ హత్యలు, ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు.


Read More
Next Story