Mahesh Kumar Goud
x

నిధులపై చర్చకు సిద్ధమా.. బండికి మహేష్ కుమార్ సవాల్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాలే దమ్ముందా? అని నిలదీశారు.


బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాలే దమ్ముందా? అని నిలదీశారు. తెలంగాణకు మీ వల్ల దమ్మిడి ఆదాయం లేదని, నిధులు కేటాయించడంలో తెలంగాణపై కేంద్రం సీతకన్ను వేసిందంటూ చురకలంటించారు. తెలంగాణను దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ తెలంగాణకు నిధులు ఇచ్చే సమయంలో కేంద్రం చూపడం లేదని చురకలంటించారు.

‘‘సన్నబియ్యం పంపిణీని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని మోడీకి లేఖ రాసే దమ్ముందా? బీసీల 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్ధత కోసం మోదీని అడిగే ధైర్యం ఉందా? దేశ వ్యాప్తంగా జనగణన తో పాటు కుల గణన చేపట్టాలని మోడీకి లేఖ రాయగలవా? కేంద్రమంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డుపడడం సిగ్గుచేటు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతంతో పనిచేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మా సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు’’ అని హెచ్చరించారు.

‘‘బిఆర్ఎస్ తో బీజేపీ అనైతిక పొత్తుతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై సంజయ్ దుష్ప్రచారం. తెలంగాణ నుంచి కేంద్రానికి వేల కోట్లు పన్నుల వెళ్తే..కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు గుండు సున్నా. కేంద్రమంత్రిని అని మర్చిపోయి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. సామాన్యుల పాలిట గుదిబండలా మారిన గ్యాస్ బండ ధరలు. పేదల కడుపులను కొట్టి కార్పోరేట్స్ కి దోచిపెట్టడమే బీజేపీ సర్కార్ విధానం. తెలంగాణ సన్న బియ్యం పంపిణీ నిరుపేదలకు వరం. స్వ‌తంత్ర భార‌త చ‌రిత్ర‌లో పేద‌ల‌కు స‌న్న‌బియ్యం పంపిణీ చేసిన మొద‌టి రాష్ట్రం తెలంగాణ‌. స‌న్నబియ్యం పంపిణీకి ప్ర‌భుత్వం ఏడాదికి 13 వేల కోట్లు ఖర్చు చేస్తోంది’’ అని తెలిపారు.

Read More
Next Story