తెలంగాణలో మరోసారి కంపించిన భూమి.. ఎంత తీవ్రతంటే..
x

తెలంగాణలో మరోసారి కంపించిన భూమి.. ఎంత తీవ్రతంటే..

తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్‌నగర్‌లో భూమి కంపించింది.


తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్‌నగర్‌లో భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత రెక్కార్ స్కేలుపై 3.0 మ్యాగ్నిట్యూడ్‌గా మనోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. భూకంప కేంద్రాన్ని కైకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో గుర్తించినట్లు అధికారువు వివరించారు. శనివారం మధ్యాహ్నం 1:22 గంటల ప్రాతంలో ఈ భూకంపం సంభవించింది. భూమి స్వల్పంగా కంపించడంతో గ్రామస్థులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. కాగా ఇటీవలే ములుగు జిల్లాలో భూకంపం వచ్చి.. కొన్ని రోజుల వ్యవధిలోనే మరోసారి భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం ఇందుకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

ములుగు భూకంప వివరాలివే..

తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.03గా నమోదైంది. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, చెన్నారావుపేట మండల కేంద్రంలో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్‌ నగర పరిధిలోని కేపీహెచ్బీ, గోకుల్ ప్లాట్స్, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

Read More
Next Story