Pushpa 2 పై ఫిర్యాదుల పరంపర..
x

PUSHPA 2 (WIKIPEDIA)

Pushpa 2 పై ఫిర్యాదుల పరంపర..

పుష్ప 2 సినిమాపై కలెక్షన్ల వెల్లువేమో కానీ ఫిర్యాదుల వెల్లువ మాత్రం భారీగానే ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస ఫిర్యాదులు నమోదవుతున్నాయి.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప 2’(Pushpa 2)పై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. టికెట్ ధరలపై కోర్టులో పిటిషన్‌లు, సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదుతో పాటు ఇప్పుడు జాతీయ మానవ హక్కుల సంఘాని(NHRC)కి కూడా ‘పుష్ప 2’ సినిమాపై ఫిర్యాదు చేరింది. ఈ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన ఘోరంపై న్యాయవాది రవికుమార్.. మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎటువంటి అనుమతులు, భద్రతా ఏర్పాటు లేకుండా ప్రీమియర్ షో నిర్వహించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆయన ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశాలిచ్చింది. ప్రీమియర్ షో నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాటు చేసిందా? లేదా? థియేటర్‌కు వచ్చే సమయంలో అల్లు అర్జున్ అన్ని నిబంధనలు పాటించారా? లేదా ? ముందస్తు సమాచారం ఇచ్చారా లేదా? వంటి అనేక అంశాలపై ఎన్‌హెచ్ఆర్‌సీ విచారణ చేపట్టనుంది. ప్రేక్షకుల భద్రతలకు గాలికొదిలేస్తూ థియేటర్ యాజమాన్యం, నటుడు అల్లు అర్జున్న ప్రవర్తించారా అన్న కోణంలో కూడా ఈ విచారణ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

‘‘సంధ్య థియేటర్ యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు పాటించకపోవడమే కాకుండా రద్దీని నియంత్రించడంలో కూడా విఫలమైంది. అల్లు అర్జున్‌ను చూడటం కోసం ఎగబడ్డ ప్రేక్షకులను కట్టడి చేయడంలో థియేటర్ యాజమాన్యం తీవ్రంగా ఫిలం కావడమే తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా. ఆమె కుమారుడు శ్రీతేజ.. ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతున్నాడు. అతడి పరిస్థతి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యులకు బాధ్యులు రూ.5కోట్ల పరిమారం అందించాలి. తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఒక బాలుడు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని న్యాయవాది రవి కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇప్పటికే పోలీసు కేసు..

అయితే ఈ భద్రతా లోపాలకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. ‘‘బుధవారం రాత్రి 9:90 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షోను.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో వేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాను తిలకించడం కోసం సినిమాలోని కీలక నటులు థియేటర్‌కు వస్తారన్న సమాచారం పోలీసులకు లేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదు. పైగా థియేటర్ యాజమాన్యం కూడా ముందస్తు జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. పబ్లిక్‌ను అదుపు చేయడం కోసం థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌ో ఎటువంటి ప్రత్యేక ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదు. రాత్రి 9:40 గంటలకు తన వ్యక్తిగత భద్రతతో అల్లు అర్జున్.. థియేటర్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభించారు. వారికి అదుపు చేసే క్రమంలో భద్రతా సిబ్బంది వారిని నెట్టేయడం ప్రారంభించారు’’ అని తెలిపారు.

‘‘అప్పటికే థియేటర్ లోపల, బయట ప్రేక్షకులతో కిక్కిరిసి పోయింది. ఈ క్రమంలో తోపులాట మొదలైంది. అది కాస్తా క్షణాల వ్యవధిలోనే తొక్కిసలాటగా మారింది. ఈ క్రమంలోనే దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవంత్ కుటుంబం కిందపడిపోయింది. వారిని గమనించిన పోలీసులు.. వెంటనే వారిని బయటకు లాగారు. రేవతి కుమారుడు శ్రీతేజకు వెంటనే సీపీఆర్ చేసి.. దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. కాగా రేవతి అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో బాలుడిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం. బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని డీసీపీ వెల్లడించారు.

Read More
Next Story