తెలుగు మూలాలున్న అమెరికన్ సెకండ్ లేడీ ఉషాను కలువనున్న పూర్వీకులు
x
జేడీ వాన్స్ దంపతులు

తెలుగు మూలాలున్న అమెరికన్ సెకండ్ లేడీ ఉషాను కలువనున్న పూర్వీకులు

తెలుగు మూలాలున్న అమెరికన్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ తన కుటుంబంతో కలిసి ఏప్రిల్ 21న భారత్ రానున్నారు. ఈ పర్యటనలో ఉషా వాన్స్ ను ఆమె పూర్వీకులు కలవనున్నారు.


తెలుగు మూలాలున్న అమెరికన్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ తన కుటుంబంతో కలిసి ఏప్రిల్ 21న భారత్ రానున్నారు. ఆమె భర్త అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్ తో కలిసి ఆయన 24వ తేదీ వరకూ అనధికారికంగా దేశంలో పర్యటిస్తారు. ఈ జంటది పూర్తిగా ప్రైవేటు పర్యటనే అయినా.. ప్రధాని మోదీతో 21న భేటీ కానున్నారు.

ఈ పర్యటనలో ఉషా వాన్స్ ను కలిసేందుకు ఆమె పూర్వీకులు ఆసక్తి చూపుతున్నారు. ఆమె పూర్వీకులది కృష్ణా జిల్లా పామర్రు సమీపంలోని సాయిపురం. 1980ల ప్రాంంలో ఈ ఊరి నుంచి వాళ్ల పూర్వీకులు అటు విశాఖపట్నం ఇటు మచిలీపట్నం వలస వెళ్లారు. ఉషా మేనత్త శారద ఇప్పటికీ చెన్నైలో ఉన్నారు. ఆమె డాక్టరు. వాన్స్, ఉషా పెళ్లికి శారద హాజరయ్యారు. ఉషా తండ్రి రాధాకృష్ణ ది సాయిపురం. తల్లి లక్ష్మీది పామర్రు. వీళ్లకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి ఉష. వీళ్ల కుటుంబానికి దగ్గరగా ఉండే ప్రొఫెసర్ విక్రమరావు కథనం ప్రకారం ఉష కుటుంబం చాలా సంప్రదాయక ఫ్యామిలీ. భక్తి ఎక్కువ. ఉష తల్లిదండ్రులు కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ఉషకు జేజమ్మ అయిన ప్రొఫెసర్ శాంతమ్మ విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు.
ఉష, వాన్స్ అనధికార పర్యటనలో ఆమె బంధువుల్లో కొందరు కలిసేందుకు సమయం కోరినట్టు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత ఆమె ఇండియా వస్తున్నందున సమీప బంధువులు ఢిల్లీలో కలుస్తారని సమాచారం.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు కలుస్తారని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాన్స్ దంపతుల గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. వాన్స్‌ పర్యటన వివరాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా ఖరారు చేసింది.
భారత పర్యటనలో భాగంగా తన కుటుంబంతో కలిసి ఢిల్లీ, ఆగ్రా, జైపుర్ ను వాన్స్‌ దంపతులు సందర్శిస్తారు. ఢిల్లీలోని ఎర్ర కోట సందర్శనకు వెళ్తారు. మధ్యాహ్నం సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌తో, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వాన్స్‌ సమావేశమవుతారు.
ఉషా దంపతులను ఆమె సమీప బంధువులు ఎవరు కలుస్తారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు.
Read More
Next Story