మూసీ పరివాహక ప్రాంత ప్రజల వినూత్న విన్నపం
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ఈ నదీ పరివాహక ప్రాంత ప్రజలు వినూత్న విన్నపం చేశారు.కేటీఆర్, ఈటెల రాజేందర్ లు వచ్చి తమ ప్రాంతంలో ఒక రోజు ఉండాలని స్థానికులు కోరారు.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం పరివాహక ప్రాంత ఇళ్లను ఖాళీ చేయవద్దని విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డుపడుతున్న నేపథ్యంలో మూసారం బాగ్ ప్రాంత మూసీ పరివాహక ప్రజలు వినూత్న విన్నపం చేశారు.
- మూసీ పరివాహక ప్రాంతంలోని మూసారం బాగ్ లో తమ ఇళ్లలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ లు వచ్చి ఒక రోజు ఉండి దీపావళి వేడుకలు జరుపుకోవాలని స్థానిక ప్రజలు కోరారు.
- కేటీఆర్, ఈటెల రాజేందర్ ల ఫొటోలు పెట్టి వారు ఉండేందుకు వీలుగా ఇళ్లలో ఏర్పాట్లు చేశారు. మూసీ తీర ప్రాంత ప్రజల వినూత్న విన్పపం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాము మూసీ తీర ప్రాంతంలో ఇళ్లను ఖాళీ చేసి డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే విపక్ష నేతలు దీన్ని రాజకీయం చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు.
గ్రేటర్ కాంగ్రెస్ నేతల నిరసన
మూసీ పరివాహక ప్రాంతంలో కేటీఆర్, హరీష్ రావు, ఈటెలలు నిద్ర చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు మడత మంచాలను ఏర్పాటు చేశారు. మూసీ ప్రాంతంలో ఒక రోజు ఉంటే ఇక్కడి సమస్యలు తెలుస్తాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు.
Next Story