ముగిసిన అల్లు అర్జున్ విచారణ..
x

ముగిసిన అల్లు అర్జున్ విచారణ..

సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు విచారించారు.


సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు విచారించారు. దాదాపు మూడు గంటలకు వరకు సాగిన విచారణ ముగిసింది. ఈ విచారణలో పలు ప్రశ్నలకు అల్లు అర్జున్.. తడబడకుండా సమాధానం చెప్పినప్పటికీ కొన్ని కీలక ప్రశ్నలకు మాత్రమే మౌనం వహించారని తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ వీడియోలను చూపిస్తూ పోలీసులు అల్లు అర్జున్‌ను ప్రశ్నించారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈ ఘటనపై మాట్లాడిన రోజునే అల్లు అర్జున్ ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించిన పలు కీలక అంశాలను పంచుకున్నారు. ఈరోజు విచారణలో పోలీసులు చూపిన వీడియోలకు ఆ ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్ చెప్పిన అంశాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మౌనం వహించినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తి కావడంతో మరికాసేపట్లో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్‌కు వెళ్తారా? వెళ్లరా? అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. ఇప్పటికే సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ టీమ్ చేరుకోవడంతో అల్లు అర్జున్‌ను కూడా పోలీసులు అక్కడకు తీసుకెళ్తారన్న వార్తలు బలం పుంజుకున్నాయి. ఈ సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌లో అల్లు అర్జున్ థియేటర్లోకి ఎలా వచ్చారు, ఎక్కడ కూర్చున్నారు, ఎలా వెళ్లిపోయారు వంటి అంశాలతో పలు కీలక విషయాలపై పోలీసులు దృష్టి సారించనున్నట్లు సమాచారం. కాగా ఈ విచారణలో కూడా తనపై అసత్య ప్రచారాలే జరిగాయని అల్లు అర్జున్ పునరుద్ఘాటించినట్లు తెలుస్తోంది. కాగా వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే మరోవైపు ఈ అంశం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. అల్లు అర్జున్‌ విషయంలో అధికారి, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ప్రతిపక్షాలు తోసిపుచ్చుతుంటే.. అధికార పక్షం నేతలు మాత్రం అల్లు అర్జున్ తన బాధ్యతమరిచి ప్రవర్తించడం వల్లే ఒక నిండు ప్రాణం పోయిందని, ఒక బిడ్డ తల్లిని కోల్పోయి కోమాలో ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తప్పుబట్టారు. అలాగైతే సీఎం రేవంత్‌ను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలని ప్రశ్నించారు.

‘‘అల్లు అర్జున్‌ను రేవంత్ రెడ్డి పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న టార్చర్ వల్ల ఒక రైతు సూసైడ్ చేసుకుంటే, ఇప్పటి వరకు దానిపై కనీసం కేసు నమోదు కాలేదు. రాష్ట్రంలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే, రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడలేదు. 500 మంది రైతులు, 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డికి మాట్లాడటానికి సమయం లేదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉంది’’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Read More
Next Story