శ్రీ తేజ కుటుంబానికి అల్లు అరవింద్ ఆర్థిక సాయం..
x

శ్రీ తేజ కుటుంబానికి అల్లు అరవింద్ ఆర్థిక సాయం..

సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి సినీ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆర్థిక సాయం చేశారు.


సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి సినీ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ భారీ సాయం చేశారు. రూ.2కోట్లు చెక్కును ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ తండ్రికి అందించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను అల్లు అరవింద్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగానే తాను సదరు కుటుంబానికి అండగా నిలబడతామని ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరుపున రూ.కోటి, పుష్ప నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షల సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు చెక్కులను టీజీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు‌తో కలిసి అల్లు అరవింద్.. అందించారు. ఈ సందర్బంగా బాలుడి ఆరోగ్య పరిస్థితిపై యన ఆరా తశారు. అనంతరం ఈ విషయాన్ని అల్లు అరవింద్ ప్రకటించారు.

‘‘శ్రీతేజ కోలుకుంటున్నాడు. వెంటిలేషన్ తొలగించారు. వెంటిలేటర్ లేకుండా బాలుడు శ్వాస, ఆహారం తీసుకోగలుగుతున్నాడు. అతి త్వరలోనే శ్రీతేజ మన మధ్య మళ్ళీ తిరుగుతాడని ఆశిస్తున్నా. న్యాయపరమైన అంశాల కారణంగా బాధిత కుటుంబాన్ని కలవలేకున్నా. అన్ని రాల అనుమతులు తీసుకున్న తర్వాత శ్రీతేజను 10 రోజుల క్రితం పరామర్శించా. ఆ సమయంలో అతడు వెంటిలేషన్‌పై ఉన్నాడు’’ అని అల్లు అరింద్ చెప్పారు.

‘‘నిన్నటికి, ఈ రోజుకు శ్రీతేజ ఆరోగ్యం కాస్తంత మెరుగుపడింది. వైద్యానికి అతడు స్పందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. పుష్ప-2 నిర్మాతలు, దర్శకుడు కలిసి బాధిత కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరాము. సినీ ప్రముఖులతో కలిసి ఆయనతో చర్చిస్తాం. హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంతా కలిసి వెళ్తాం. గురువారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది’’ అని దిల్ రాజు చెప్పారు.

Read More
Next Story