గ్లోబల్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్,హైదరాబాద్‌లో అలర్ట్
గ్లోబల్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్‌ను డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడంతో హైదరాబాద్‌లో అలర్ట్ ప్రకటించారు.నగరంలో ఆఫ్రికా దేశ విద్యార్థులు ఉన్నందున ఈ ఇన్‌ఫెక్షన్ పై అలర్ట్.
కరోనా కంటే మంకీపాక్స్ డేంజర్,ఇది అంటువ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటన జారీ చేయడంతో హైదరాబాద్ నగరంలో అలర్ట్ ప్రకటించారు. ఆఫ్రికా దేశ విద్యార్థులు హైదరాబాద్ నగరంలో ఉన్న నేపథ్యంలో అప్రమత్తత ప్రకటించారు.
- ఆఫ్రికా దేశంలో ఇప్పటికే 17,500 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.ఈ మహమ్మారి వల్ల 460 మంది మరణించారు. ఇది అంటువ్యాధి కావడంతో ఆఫ్రికన్ విద్యార్థులు హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఉన్నందున డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికతో హైదరాబాద్ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
- ఆఫ్రికాలో మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ వాచ్‌డాగ్ ప్రజారోగ్యశాఖ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
- ఈ వైరస్ వ్యాప్తి పలు ఆఫ్రికన్ దేశాల్లో, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వ్యాపిస్తుంది.
- మంకీపాక్స్‌ను కాంటినెంటల్ సెక్యూరిటీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తున్నామని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధిపతి జీన్ కసేయా చెప్పారు.
-ఆఫ్రికన్ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి వచ్చి ఉన్నందున, ఈ అంటు వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.ఉన్నత విద్య అభ్యసించే ఆఫ్రికన్ విద్యార్థులకు హైదరాబాద్ ప్రముఖ గమ్యస్థానంగా ఉంది.
- డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికతో హైదరాబాద్ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆఫ్రికన్ విద్యార్థులపై వైద్యులు దృష్టి సారించారు.
మంకీ పాక్స్ అంటే ఏమిటి?
ఆఫ్రికాలో 2022వ సంవత్సరంలో మంకీపాక్స్ వ్యాధిని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించింది.ఈ వైరస్ మశూచి వంటి లక్షణాలతో కూడిన వైరల్ జూనోటిక్ వ్యాధి అని తేలింది. ఈ వైరస్ మంకీపాక్స్ వైరస్ వల్ల సంభవిస్తుంది.ఈ వ్యాధిని మొదటిసారిగా 1958వసంవత్సరంలో కోతుల్లో కనుగొన్నారు. మొదటి మానవ కేసు 1970వ సంవత్సరంలో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వెలుగుచూసింది. 2003వ సంవత్సరంలో ఆఫ్రికా వెలుపల మొట్టమొదటి మంకీపాక్స్ వ్యాప్తి అమెరికాలో వెలుగుచూసింది.
ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
మంకీపాక్స్ వైరస్ గాలి ద్వారా సంక్రమించే కోవిడ్‌లా కాదు.ఈ వైరస్ సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష పరిచయం, లైంగిక సంపర్కం లేదా గాయాలతో సన్నిహిత సంబంధం ద్వారా మాత్రమే వ్యాధి సోకుతుంది.
మంకీపాక్స్ లక్షణాలు:మంకీపాక్స్ వైరస్ లక్షణాలు శోషరస గ్రంథుల వాపు, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, తీవ్ర బలహీనతలుంటాయి. జ్వరం వచ్చిన 1-3 రోజులకు చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి.
మంకీపాక్స్ వైరస్ గురించి అవగాహన అవసరం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం మంకీపాక్స్‌ను అంతర్జాతీయ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడంతో, ప్రజలు ఈ వైరస్ ప్రమాద కారకాలు,ఎక్స్‌పోజర్‌ను తగ్గించే చర్యల గురించి తెలుసుకోవాల్సి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.ఆఫ్రికా దేశం నుంచి హైదరాబాద్ కు విద్యార్థులు వచ్చినందున,మంకీపాక్స్ వైరల్ ఇన్‌ఫెక్షన్ గురించి సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ నగరానికి చెందిన ఆశ్రిత ఆసుపత్రి డాక్టర్ రామ్మోహన్ రావు చెప్పారు.
ఆందోళన చెందాల్సిన పనిలేదు : గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
హైదరాబాద్ నగరంలో ఆఫ్రికా విద్యార్థుల వల్ల మంకీపాక్స్ వైరస్ ప్రబలినట్లు ఎలాంటి కేసులు రాలేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ వైరస్ గురించి హైదరాబాద్ లో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని డాక్టర్ రాజారావు కోరారు.
వైద్యునికి సలహా
ఆఫ్రికన్ దేశాలకు చెందిన మంకీపాక్స్ రోగుల ప్రయాణ చరిత్రను తప్పనిసరిగా ట్రాక్ చేయాలి.మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష పరిచయం ద్వారా వ్యాపిస్తుంది. గత 21 రోజుల్లో ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన వారి ప్రయాణ చరిత్రను పరిశీలించాల్సి ఉంది.శరీరంపై తీవ్రమైన దద్దుర్లు ఉంటే,వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
Next Story