మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో తెలంగాణ మంత్రులకు కీలక బాధ్యతలు..
x

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో తెలంగాణ మంత్రులకు కీలక బాధ్యతలు..

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రులకు కీలక పదవులు కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, ఝార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయడమే తరువాయిగా ఉంది. కాగా రాజకీయ పార్టీలు మాత్రం ముందుగానే ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టేశాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులు, పార్టీ స్థితిగతులను అంచనా వేయడం కోసం పార్టీలన్నీ ప్రత్యేక పరిశీలకులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ.. ఈ పరిశీలకుల జాబితాలో తెలంగాణ మంత్రులు పేర్లను చేర్చడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ జెండా పాతగా.. ఇప్పుడు మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు పరిశీలకుల పేర్లను ప్రకటిస్తూ ఏఐసీసీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

మంత్రులకు అదనపు బాధ్యతలు

ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రులు పలువురికి కాంగ్రెస్ హైకమాండ్ అదనేపు బాధ్యతలు అప్పగించింది. వీరిలో మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా మరోవైపు ఝార్ఖండ్ ఎన్నికల పరిశీలకునిగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎలాగైనా కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించడంతో పాటు ఎన్నికల సమయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవడమే వీరి బాధ్యతగా తెలుస్తోంది. ఇందుకు ముగ్గురు మంత్రులు కూడా ఓకే చెప్పారు.

భట్టికి ఇదే తొలిసారి..

ఇదిలా ఉంటే పొరుగు రాష్ట్రంలో ఎన్నికల పరిశీలకునిగా బాధ్యతలు చేపట్టడం భట్టివిక్రమార్క మల్లుకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆయన ఇప్పటి వరకు తెలంగాణ తప్ప మరే ఇతర రాష్ట్రంలో ఇటువంటి బాధ్యతలు నిర్వర్తించలేదు. దీంతో తన తొలిసారి పరిశీలకునిగా భట్టి విక్రమార్క ఎన్ని మార్కులు పొందుతారో చూడాలి.

Read More
Next Story