జూబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్న ఎగ్జిట్ పోల్స్ !
x

జూబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్న ఎగ్జిట్ పోల్స్ !

ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపేనని జోస్యం.


జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ గెలుస్తారని జోస్యం చెప్పాయి. మంగళవారం జరిగిన పోలింగ్‌లో ఓటర్స్ టర్న్‌ఔట్ తక్కువగానే నమోదయింది. అంతా 60శాతాన్ని క్రాస్ చేస్తుందని అంచనా వేయగా.. అది మాత్రం 50 కూడా కష్టమే అన్నట్లు నత్తనడకన నడుస్తోంది. దీంతో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ ముగవడంతో విజేత గురించి ఇప్పుడు రాష్ట్రమంతా చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కీలకంగా మారుతున్నాయి. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపాయి.

ఎగ్జిట్ పోల్స్ ఇలా

పబ్లిక్ పల్స్(శ్రీనివాస్) : కాంగ్రెస్ 48.5(+-2), బీఆర్ఎస్ 41.5(+-2), బీజేపీ 6.5 (+-2)

నాగన్న సర్వే: కాంగ్రెస్ 47.84, బీఆర్ఎస్ 41.46, బీజేపీ 8.71

జన్‌మైన్ సర్వే: కాంగ్రెస్ 42.5, బీఆర్ఎస్ 41.5, బీజేపీ 11.5

చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46శాతం, బీఆర్ఎస్ 41, బీజేపీ 6శాతం ఓట్లు

స్మార్ట్ పోల్: కాంగ్రెస్ 48.2, బీఆర్ఎస్ 42.1 శాతం, బీజేపీ 9.7 ఓట్లు

పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 48శాతం, బీఆర్ఎస్ 41, బీజేపీ 6శాతం

హెచ్ఎంఆర్: కాంగ్రెస్ 48.31 శాతం, బీఆర్ఎస్ - 43.18 శాతం, బీజేపీ - 5.84 శాతం, ఇతరులు - 2.67 శాతం

రేస్: కాంగ్రెస్ 46శాతం, బీఆర్ఎస్ 41శాతం, బీజేపీ 8 శాతం, ఇతరులు 2.5శాతం

Read More
Next Story