ACB BAG | ఏసీబీ నల్లబ్యాగుపై బీఆర్ఎస్,కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం
ఏసీబీ ఆఫీసులోని నల్లబ్యాగుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది.బ్యాగులోని అక్రమాల చిట్టా మీదంటే మీదని బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటున్నాయి.
ఈ ఫార్ములా కారు రేస్ కేసులో కేటీఆర్ విచారణకు వెళ్లిన నేపథ్యంలో ఏసీబీ కార్యాలయంలో ఉన్న నల్లబ్యాగు సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు ఉద్ధేశించిందని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ పోస్టులో ట్వీట్ చేసింది. ఏసీబీ ఆఫీసులో ఉన్న నల్ల బ్యాగు ఉంది, ఎవరిదో చెప్పుకోండి అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.
- దానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ట్వీట్ చేసింది. ‘‘పదేళ్ల నుంచి దుమ్ము పట్టిన ఈ నల్లబ్యాగు ఏసీబీ ఆఫీసులో ఉంది...ఈ బ్యాగ్ ఎవరిది? ఆ నల్ల బ్యాగును చూసి తెల్లమొహం వేసుకున్నడా కేటిఆర్!?ఈ నల్ల బ్యాగులో 2014వ సంవత్సరం నుంచి మీరు చేసిన పాపాల చిట్టా ఉంది’’అని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిగా ట్వీట్ చేసింది.
కేటీఆర్ స్కాములు ఎన్నెన్నో...
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘ఫార్ములా ఈ కార్ రేస్ స్కాం, ఔటర్ రింగు రోడ్డు దోపిడీ,కాళేశ్వరం స్కాం,అక్రమ ఫోన్ ట్యాపింగ్,విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు,ప్రభుత్వ భూముల అక్రమ అమ్మకాలు,కవిత లిక్కర్ స్కాం,ధరణీ పోర్టల్ తో చేసిన భూ దోపిడీ,స్కీంల వంకతో చేసిన స్కాంలు,గొర్రెల స్కాం,సర్పంచ్ లకు ఎగ్గొట్టిన బిల్లులు,మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పుల వివరాలు,దళితుల పై మీరు చేసిన దౌర్జన్యాలు’’ఎన్నో ఈ నల్ల బ్యాగులో ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది.‘‘ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి.
మీ బీఆర్ఎస్ దోపిడీ దొంగల అవినీతి వివరాలను నింపడానికి ఆ ఒక్క బ్యాగు సరిపోదు, ఇంకా చాలా బ్యాగులను నింపాల్సి ఉంది. కేటీఆర్ విచారణకు వెళ్లిన ప్రతిసారి బ్యాగులను లెక్కించమని చెప్పండి’’ అంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఏసీబీ కార్యాలయంలో నల్లబ్యాగుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ట్విట్టర్ వార్ సాగుతోంది.
ఏసీబీ ఆఫీసులో ఈ నల్ల బ్యాగు ఉంది, ఎవరిదో చెప్పుకోండి.. pic.twitter.com/wBQCpjtq8f
— BRS Party (@BRSparty) January 9, 2025
ఆ నల్ల బ్యాగును చూసి తెల్లమొహం వేసుకున్నడా కేటిఆర్!?
— Telangana Congress (@INCTelangana) January 10, 2025
ఆ నల్ల బ్యాగులో 2014 నుండి మీరు చేసిన పాపాల చిట్టా ఉంది.
👉 ఫార్ములా ఈ కార్ రేస్ స్కాం,
👉 ఔటర్ రింగు రోడ్డు దోపిడీ,
👉 కాళేశ్వరం స్కాం,
👉 అక్రమ ఫోన్ ట్యాపింగ్,
👉 విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు,
👉 ప్రభుత్వ భూముల అక్రమ… https://t.co/hwrTk4l1zx
Next Story