HCU SFI
x

HCU లో అకడమిక్ వాతవరణాన్ని విచ్చిన్నం చేస్తున్న ABVP

హెచ్.సి.యు.లో అకడమిక్ వాతవరణాన్ని ఏబీవీపీ విచ్ఛిన్నం చేస్తోందని ఎస్ఎఫ్ఐ లీడర్లు ఆరోపించారు. మద్యం మత్తులో దివ్యాంగుడిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


హెచ్.సి.యు.లో అకడమిక్ వాతవరణాన్ని ఏబీవీపీ విచ్ఛిన్నం చేస్తోందని ఎస్ఎఫ్ఐ లీడర్లు ఆరోపించారు. మద్యం మత్తులో దివ్యాంగుడిపై దాడి చేశారని, ఈ దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన విద్యార్ధులపైనా దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలను సైతం లైంగికంగా వేధించారని వెల్లడించారు. ఆధారాలను ముందుంచినా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోవడం లేదని, దీనిపై వారు వెంటనే స్పందించి దాడులకు పాల్పడిన దోషులను రస్టికేట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఆదివారం భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో సమావేశం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు, హెచ్.సి.యు. విద్యార్ధి, ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు శివదుర్గారావు, హెచ్.సి.యు. విద్యార్ధి సంఘం అధ్యక్షుడు అతీక్, హెచ్.సి.యు. యూనిట్ కార్యదర్శి కృపాజార్జ్, హెచ్.సి.యు. విద్యార్థులు, ఎబివిపి దాడిలో గాయపడిన విద్యార్ధులు మోహిత్, ఆషిక, ఖాయినీ, ఫైజల్ లతో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. ఏప్రిల్13వ తేదీ ఎకనామిక్స్ డిపార్మెంట్స్ ఫేర్వెల్ పార్టీ జరుగుతున్న సందర్భంలో ఎబివిపికి చెందిన వారు మద్యం మత్తులో అల్లరి చేస్తూ పాటల విషయంలో గోడవ చేస్తుంటే విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో దివ్యాంగుడైన స్కాలర్ పై అకారణంగా దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారని అక్కసుతో తిరిగి 17వ తేదీ మైనారిటీ వర్గానికి చెందిన ఫైజల్ అనే విద్యార్ధిని తన రూమ్ లోకి వెళ్తున్న సందర్భంగా అతనిపై విచక్షణా రహితంగా కిరాతకంగా దాడి చేశారు. గొంతు నులిమి బెదిరింపులకు పాల్పడ్డారు. జే ఎన్ యు లో నబీబ్ అనే విద్యార్ధి అదృశ్యమైన ఘటన తెలిసిందే అలా నిన్ను అదృశ్యం చేస్తామని బెదిరింపులు గురి చేశారన్నారు.

జె హాస్టల్స్ దగ్గర దాడి చేస్తుంటే అడ్డుకున్న ఇతర విద్యార్ధులపై కూడా మద్యం సేవించి హాకీ స్టీక్లతో దాడిచేశారు. అమ్మాయిలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని లైంగిక వేధింపులు గురిచేశారు. జుట్టు పట్టుకుని లాగి క్రిందకు నెట్టేశారు. వందలాదిగా గుమిగూడి మారణ ఆయుధాలతో దాడి చేశారని తెలిపారు.10 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. మరో10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులు వెళ్తున్న అంబులెన్స్ కి సైతం దారి ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఈ అంశాలను పోలీసులు దృష్టికి తీసుకెళ్ళినా వారు విచారణ సరిగ్గా చేయకుండా రెండు వర్గాలు మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారు. ఇద్దరిపై కేసులు అంటూ బైండోవర్స్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనలో నిష్పక్షపాత విచారణ జరిపి దాడి చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు.

దేశంలో, ప్రపంచంలో గొప్ప పేరున్న హెచ్.సి.యు.లో అకడమిక్ వాతవరణాన్ని ధ్వంసం చేసే చర్యలకు దిగుతున్న ఏబీవీపీ పై యూనివర్శీటి అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. జరిగిన ఈ ఘటనను మత కోణంలో చిత్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ఎబివిపి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా యూనివర్శీటీ లో విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ ని విద్యార్థులు ఎన్నికల్లో గెలుపిస్తూ ఆదరిస్తున్నారు. ఈ అక్కసుతో సాధరణ విద్యార్థులపై దాడి చేస్తున్నారు. విద్యార్థులలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

విద్యార్థులపై, యూనివర్శీటీ సెక్యూరిటి పై దాడి చేస్తున్నట్లు వీడియో ఫుటేజ్ ఆధారాలు ఉన్నప్పటికీ యూనివర్శీటీ అడ్మినిస్ట్రేషన్ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వారిని యూనివర్సిటీ నుండి రస్టీకేట్ చేయాలని, చేసేంత వరకు పోరాడతామని చెప్పారు. ఎబివిపి చేస్తున్న ఈ చర్యలు వ్యతిరేకంగా క్యాంపస్ ను కాపాడుకునేందుకు విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ముందుకు రావాలని.. మతోన్మాద చర్యలను ఖండించాలని ఈ సందర్భంగా విద్యార్ధి నేతలు పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జూనుగరి రమేష్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు స్టాలిన్ ,సెంట్రల్ యూనివర్శీటీ విద్యార్థులు పాల్గొన్నారు.



Read More
Next Story