శంషాబాద్ విమానాశ్రయంలో తృటితో తప్పిన ప్రమాదం.. 150 మంది సేఫ్..
x

శంషాబాద్ విమానాశ్రయంలో తృటితో తప్పిన ప్రమాదం.. 150 మంది సేఫ్..

పది నిమిషాల సేపు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో మిమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. గోవా నుంచి వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్6ఈ-6973 విమానం శంషాబాద్‌మీదుగా వైజాగ్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో శంషాబాద్‌‌ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి ఏఐసీ అధికారులు అనుమతించడంతో పైలట్ విమానం హైడ్రాలిక్ గేర్‌ను సిద్ధం చేశారు. విమాన సర్వీస్‌ను డౌన్ చేసిన పైలట్ అప్పటికే రన్‌వేపై టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించారు. వెంటనే తమ విమానాన్ని మళ్ళీ గాల్లోకి లేపారు. ఈ క్రమంలోనే తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఏమాత్రం ఆలస్యం అయి ఉన్నా రెండు విమానాలు ఢీకొనిఉండేయి.

ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవా నుంచి 150 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్ లైన్స్ 6 ఈ 6973 విమాన సర్వీసు శంషాబాద్ మీదుగా విశాఖకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ విమానానికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ విమానం హైడ్రాలిక్ గేర్‌ను సిద్ధం చేశాడు. విమాన సర్వీసును డౌన్ చేసిన పైలట్.. అప్పటికే రన్ వేపై టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించి అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని టేకాఫ్ చేసి, పెను ప్రమాదం తప్పింది. పది నిమిషాల సేపు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విమాన సర్వీస్ విశాఖకు వెళ్లిపోయింది. అయితే.. రన్ వేపై టేకాఫ్ తీసుకోవడానికి ఒక విమానం ఉండగా, మరో విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇవ్వడాన్ని ప్రయాణికులు తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పడంతో అతన్ని అభినందిస్తున్నారు.

Read More
Next Story