శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ నిర్మాణ సంక్షిప్త చరిత్ర
x

శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ నిర్మాణ సంక్షిప్త చరిత్ర

ఒక వైపు నిర్మాణ సమస్యలు, మరొక వైపు కేంద్రం అనుమతుల జాప్యం. శనివారం నాటి ప్రమాదంతో నిర్మాణం ఎంత కాలం ఆగుతుందో చూడాలి


టెఉమ్మడి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు అందించేందుకు ఉద్దేశించిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ( SLBC) సొరంగ మార్గం(Tunnel) నిర్మాణం 2012కే పూర్తికావాలి.

శ్రీశైలం రిజర్వాయర్‌ (Srisailam Reservoir) సమీపంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దోమలపెంట ప్రాంతం నుంచి న్లల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాంతం వరకు 43.930 కిలోమీటర్లు సొరంగం (టన్నెల్‌) తవ్వడం SLBC ప్రాజక్టు. శ్రీశైలం ప్రాజక్టు నుంచి 30 టిఎంసి ల నీటిని ఎస్ ఎల్ బిసి నుంచి తీసుకుని డిండి దగ్గిర నిర్మిస్తున్న రిజర్వాయర్ లోకి మళ్లించాలి. అక్కడి నుంచి నీటిని నల్లొండ జిల్లాకు తరలించాలనేది ప్రాజక్టు లక్ష్యం. ఇందులో రెండు టన్నెల్స్ ఉన్నయి. మొదటి టన్నెల్ పొడవు 43.9 కిమీ. ఇదే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తెలిదేవర్ పల్లి రిజర్వాయర్ లోకి విడుదల చేస్తుంది. దీని సామర్థ్యం 7.54 టిఎంసి లు. ఇక రెండో టన్నెల్ గ్రావిటీ ద్వారా ఈ నీటిని రిజర్వాయర్ లోకి మళ్లిస్తుంది. ఈ సొరంగ నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతమని చెబుతారు.

నిజానికి ఈ ప్రాజక్టు నిర్మాణానికి ఎపుడో 1983లోనే ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే పునాది రాయి వేశారు. అయితే, చాలా పొడవైన సొరంగం తవ్వాల్సిన రావడంతో ఆ ప్రాజక్టు ఆచరణ సాధ్యంకాదని వదిలేశారు. కాలువ నిర్మాణం అడవీ మార్గం గుండా తవ్వాలి. దీనికి అటవీ శాఖ ఒప్పుకోలేదు. పోనీ సొరంగం తవ్వుదామా అంటే అప్పటికింకా 44 కిమీ పొడవైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాలేదు.

టనెల్ లోకి సిబ్బంది తీసుకు వెళ్లే రైలు

తర్వాత ఈ ప్రాజక్టుకు అలిమినేటి మాధవరెడ్డి ప్రాజక్టు (AMR Project) అని పేరు పెట్టారు. 1990లో సొరంగం మార్గం తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రాజక్టు పనులు ఎపుడో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మొదలయ్యాయి. 2007లో మొదలైన ఈ సొరంగమార్గం పనులకు అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో మొదట ఆలస్యం అయింది. తర్వాత సొరంగం తవ్వకం సవాల్ గా మారింది. నల్లమల అడవి దిగువన భూగర్భంలో 500 మీ లోతున ఈ టనెల్ నిర్మాణం సాగాలి. నిధుల కష్టాలు, జటిల నిర్మాణం వల్ల ప్రాజక్టు నిర్మాణం డెడ్ లైన్ ఆరుసార్లు పొడిగించాల్సి వచ్చింది. చివరకు 2026 నాటికి ప్రాజక్టు నిర్మాణం జరిపితీరాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసమే పనులను మొదలు పెట్టింది. ఇంతలోనే శనివారం నాడు ప్రమాదం జరిగింది. గ్రనైట్ కాకుండా గులకరాళ్ల మట్టి వదులుగా ఉండటం, ఉటలు విపరీతంగా ఉండటం, నీరు విపరీతంగా టెనెల్ లోకి వస్తూ ఉండటంతో కప్పుకుంగిపోతో వస్తున్నది. దీని వల్ల పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదు. శనివారం నాడు కుంగిన కప్పు భారీగా మట్టిని కూల్చి సొరంగాన్ని మూసేయండతో గతంలో ఎపుడులేని అంతరాయం ఎదరయింది. తొలిసారిగా ఈ ప్రాజక్టులో 8 మంది సిబ్బంది చిక్కుకుపోయారు. వాళ్లు భద్రంగా ఉన్నారో లేరోకూడా తెలియని పరిస్థితి వచ్చింది.

టనెల్ లో మీటర్లు మందంతో పేరుకు పోయిన బురద, ఊట నీరు

తాజాలెక్కల ప్రకారం ప్రాజక్టు ఖర్చు రు.4,658 కోట్లు, ఇందులో రు.2,646 కోట్లు ఖర్చు చేశారు. సొరంగం నిర్మాణానికి సంబంధించి ఒక వైపు నుంచి 20.5 కిమీ, మరొక వైపు నుంచి 14 కి.మీ పూర్తయింది. ఇపుడు సవాల్ గా మారింది మిగిలిపోయి ఉన్న 9.5 మీ సొరంగ నిర్మాణమే. దీనికోసం ఇటీవలే రాష్టమంత్రి కోమటిరెడ్డిఅమెరికా వెళ్లి టిబిఎం సప్లయి గురించి మాట్లాడి వచ్చారు.

ప్రాజక్టు పనులు జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (JAL) కు అప్పగించారు. ఈ సంస్థ రెండు 10 మీ వ్యాసం ఉండే హార్డ్ రాక్ డబుల్ షీల్డ్ టనెల్ బోరింగ్ మిషన్స్ (TBM) ఉపయోగించి సొరంగం తవ్వాలి. ఇలా ఈ మిషన్లు సుమారు 44 కి. మీ పొడవైన 9.2 మీ గుండ్రటి టనెల్ ను తవ్వాలి. ఈ తవ్వకానికి మొదటి దెబ్బ కంపెనీకి బిల్లులు చెల్లించపోవడం తగిలిగింది. డెడ్ లైన్ లోపు నిర్మాణం కాలేదు.

2019లో పనులు చేస్తున్నప్పుడు మట్టి, రాళ్లు కూలుతుండడంతో పనులు ముందుకుసాగకుండాపోయింది. దీనిని నివారించేందుకు ఊట నీటిని తోడివేస్తూ, మట్టిని తొలగించడంతో పాటు, ఊట మళ్లీ రాకుండా, మట్టి, రాళ్లు పడకుండా ఉండేలా సిమెంట్‌, పాలియేరిథిన్‌ తో గ్రౌటింగ్‌ చేయించారు.

ఇపుడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక పనులు ప్రారంభించడం మీద దృష్టిపెట్టారు. ఐదు రోజుల క్రితమే ఈ పనులను మళ్లీ మొదలయ్యాయి. శనివారం పనులు జరుగుతున్న టన్నెల్‌ వద్ద సుమారు వందమీటర్లకు పైగా కప్పు కూలిపోవడంతో ప్రమాదం జరిగింది.

టనెల్ చిక్కకు పోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న ఎన్ డిఆర్ ఎఫ్ , సైనికులు

సొరంగం పెండింగ్‌ పనులు కష్టభూయిష్టం అయ్యేందుకు మూడు కారణాలు: 1) 14వ కిలోమీటర్‌ నుంచి 19.500 కిలోమీటర్‌ వరకు ఉన్న ప్రాంతంలో ఊట నీటిని అదుపుచేయలేకపోవడం. 2) శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు టన్నెల్‌ కాంటూరు లెవల్స్‌ కంటే ఎగువన ఉండడం. 3) ఇక్కడ గ్రానైట్‌, రాతిశిలల కంటే మట్టి, గులక రాళ్లు ఎక్కువగా ఉండటం. దీంతో సొరంగం తవ్వగానే లూజు మట్టి జారి కూలిపోతున్నదని ఇంజనీర్లు చెబుతున్నారు.

మార్చి నుంచి ఔట్‌లెట్‌ పనులు మొదలవుతాయా?

శ్రీశైలం ప్రాజక్టు సమీపంలోని మన్నేవారిపల్లి నుంచి చేపట్టిన అవుట్‌లెట్‌ టన్నెల్‌ (ప్రాజక్టు నీరు సొరంగంలోకి బయటకు వచ్చే మార్గం) పొడవు 23.980 కిలోమీటర్లు

ఇందులో 20.435 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా 3.545 కిలోమీట ర్ల పని మిగిలి ఉంది. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) సొరంగం పనులు చేపడతారు.

సొరంగం తవుతున్నటన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) కూడ తరచూ చెడిపోతూ ఉంది. మరమ్మతులు చేయాల్సి వచ్యినపుడు విడిభాగాలకోసం సంవత్సరాల తరబడి వేచిచూడాల్సి వస్తున్నది. పనులు ఆలస్యమయ్యేందుకు ఇదొక కారణం.

టనెల్ లో ప్రవహిస్తున్న బురద నీరు

టీబీఎంలో కీలకమైన బేరింగ్‌ ఏడుమీటర్ల వ్యాసంతో, 37 మెట్రిక్‌ టన్నుల బరువుతో ఉంటుంది. ఈ బేరింగ్‌ ను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి. ఈ బేరింగ్‌ ఇటీవలే చెన్నై పోర్టుకు చేరినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా మన్నెవారిపల్లి వద్దకు చేరుకుంటుందని,మార్చిల్ అవుట్ చివరి దశ పనులు మొదలవుతాయని ఇరిగేషన్‌ ఇంజనీర్లు భావిస్తున్నారు. అయితే, ఇన్‌లెట్‌ వైపున శని వారం జరిగిన దుర్ఘటన వల్ల ఈ పనులు జాప్యం కావచ్చని అనుకుంటున్నారు.

2015 దాకా జోరుగాసాగిన పనులు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం నిర్మాణం 2015వరకు ఉధృతంగా సాగింది. కాని బేరింగులకే విరిగిపోవడంతో మరోవైపు ఇన్‌లెట్‌ వైపున ఊట నీరు వస్తుండడంతో పనులు నత్తనడక నడిచాయి. దానికి తోడు 2019 నుంచి కాంట్రాక్ట్‌ సంస్థ సైతం నిర్వహణ భారం పెరగడం, ప్రాజెక్టు వ్యయం పెరిగిందని పనులను నిలిపింది.

2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు పనులపై శ్రద్ద మొదలయింది. ప్రాజెక్టు వ్యయం పెంచడంతో పాటు, పెండింగులో ఉన్న బిల్లులను గ్రీన్‌ఛానల్‌లో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో అవుట్ లెట్ పనులు మళ్లీ మొదలయ్యే వాతావరణం ఏర్పడింది. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ రూ.800కోట్ల నిధులు కేటాయించారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, భారీనీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సెప్టెంబరులో ప్రాజెక్టును సందర్శించారు. పనులు మొదలుపెట్టేందుకు రంగం సిద్దం చేశారు. ఈ పనులు ఊపందుకుంటాయని భావించిన తరుణంలో ఈ ప్రమాద ఘటనతో మళ్లీ పనులకు బ్రేక్‌ పడినట్లయింది.

సొరంగం బురద మయం

శనివారం కప్పు కుంగిపోవడంతో విపరీతంగా వూట నీరు టనెల్ లోకి ప్రవహిస్తూ ఉంది. అధికారులు చెబుతున్నదానిప్రకారం నిమిషానికి ౩౦౦౦ నుంచి 4000 లీటర్లు దాకా వూటనీరు దుముకుతూ ఉంది. ఈ ఉధృతికి యంత్రాలు కూడా కొట్టుకు వస్తున్నట్లు కొందరు చెప్పారు. ఈ నీళ్లను బయటకు తోడటం పెద్ద సవాల్ గా మారింది. సొరంగంలో 400 మీటర్ల పొడవున 2.5 మీ మందంతో మట్టి కూరుకుపోయి ఉంది. బురద, విరిగిన యంత్రాల భాగాలతో ఈ ప్రాంతం బీభత్సంగా ఉందని, సహాయచర్యలు చేపట్టే వాళ్లు ముందుకు పోలేకపోతున్నారని సమ ాచారం. దీనితో లోపల చిక్కుకుపోయిన 8 మంది సిబ్బంది భద్రత ఆందోళనలకు దారితీస్తూ ఉంది. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ దళాలు రంగంలోకి చిక్కుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.కనీసం మూడు రోజులపాటు నిర్విరామంగా శ్రమిస్తే తప్ప లోపలికి వెళ్లే మార్గం ఏర్పడదని అధికారులు చెబుతున్నారు.

రాట్ హోల్ మైనర్స్ (Rat-hole Miners) రంగంలోకి

త్వరితంగా సొరంగంలో చిక్కకున్న వారితో కమ్యూనికేషన్ పెట్టుకునేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్ ని ఉత్తరాఖండ్ నుంచి రప్పించారు. ఉత్తరాఖండ్ లోని సిలక్యారా (Silkyara-Bend) టనెల్ లో చిక్కుకున్నవారిని 17 రోజుల తర్వాత కాపాడింది ఈ బృందమే. అందుకే వారిని కూడా ఎస్ ఎల్ బిసి రెస్క్యూ ఆపరేషన్ కు రప్పించారు.

అటవీ అనుమతులు, పునరావాస పనులూ జాప్యమే

ఈ ప్రాజెక్టుకు కీలకమైన అటవీ అనుమతులతో పాటు, నిర్వాసితుల పునరావాసకల్పన సైతం పెండింగ్‌లోనేవివదాస్పదంగా ఉంది.

తెలిదేవర్‌పల్లి వద్ద నిర్మిస్తున్న నక్కలగండి (డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌) రిజర్వాయర్‌ లోకి శ్రీశైలం జిలాలను నింపాలి. అంటే తొందరగా పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఈ ప్రాజక్టుల వల్ల ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ఫారెస్టకు చెందిన 281.93 హెక్టార్ల భూమి ముంపునకు గురి అవుతున్నది. ఈ భూములను ప్రాజెక్టుకు కేటాయించేందుకు కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు కావాలి. ఈ అనుమతి జాప్యం అవుతూ ఉంది. ఈ భూమిని కేంద్రం అటవీభూములను ప్రాజక్టుకు కేటాయిస్తే, దీనికి బదులుగా 790 హెక్టార్లలో అడవిని అభివృద్ధి చేసి ఇచ్చేందుకూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ అనుమతులు వస్తేనే నక్కలగండి రిజర్వాయర్‌ పనులు పూర్తవుతాయి.

ఈ నక్కలగండి రిజర్వాయర్‌ తో మరొక సమస్య వచ్చింది. అది పునరావాస సమస్య. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలోని నక్కలగండితండా, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట మండలంలోని కేశ్యతండ, మర్లపాడుతండాలు ముంపునకు గురవుతున్నాయి.

2015-16లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈ మూడుతండాల్లో 629 గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో ముంపు ప్రాంతమైన నక్కలగండి తండాకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మించేందుకు చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద 10 ఎకరాల భూమినిగుర్తించినా. పనులు చేపట్టలేదు.

మరొకవైపు నాగర్‌కర్నూల్‌జిల్లా పరిధిలోని కేశ్యతండా, మర్లపాడుతండాలకు సంబంధించి పునరావాస ప్యాకేజీల పరిష్కారం పూర్తికాలేదు.

Read More
Next Story