తెలంగాణలో 100 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
x

తెలంగాణలో 100 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు

తెలంగాణలో మొక్కజొన్నలకు మద్ధతు ధర అందించడంతోపాటు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు 100 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు.


తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 5,46,865 ఎకరాలకు పెరిగింది. దీంతో మొక్కజొన్నల పంట దిగుబడి అంచనా 9,63,102 మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. దీంతో మార్కెట్లోకి వచ్చే మొక్కజొన్నలను ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధరకు కొనుగోలు చేస్తుందని మార్క్‌ఫెడ్ అధికారులు చెప్పారు.

- ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన మొక్కజొన్న మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,225లుగా నిర్ణయించారు. మార్కెట్లో మొక్కజొన్నల సగటు ధర కొన్ని ప్రాంతాల్లో రూ.2,172రూపాయలుగా ఉంది. బహిరంగ మార్కెట్ లో క్వింటాలుకు 75 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మద్దతు ధరకన్నా తక్కువ పలుకుతుంది.

మార్క్‌ఫెడ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి నాఫెడ్ అంగీకరింది. రాష్ట్రవ్యాప్తంగా 100 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను నాఫెడ్ తరపున కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు తీసుకొన్నట్లు మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. మద్దతు ధరకు అనుగుణంగా మొదటగా నాఫెడ్ తరపున జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో 12 కేంద్రాలను శనివారం నుంచి ఏర్పాటు చేస్తామని మార్కెఫెడ్ అధికారులు చెప్పారు.తెలంగాణలో అదనంగా వచ్చిన మొక్కజొన్నల దిగుబడిని మద్దతు ధరకు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మార్క్‌ఫెడ్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.


Read More
Next Story